
రక్త పరీక్షల ఆధారంగా వైద్యసేవలు
● ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశం
అడ్డతీగల: జ్వరపీడితులకు రక్త పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా వైద్యం అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి నివారణ మందులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అడ్డతీగల, కొట్టపాలెంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో ఒకటికి రెండుసార్లు పాఠ్యాంశాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూ చిం చారు. పాఠ్య, నోట్ పుస్తకాలు అందిరికీ అందిందీ లేనిది విద్యార్థులనుంచి తెలుసుకున్నారు. మెనూ పక్కాగా అమలు చేయాలని సూచించారు. వేటమామిడిలో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను, భవనాలను ఆయన పరిశీలించారు. నాణ్యత పాటిస్తూ త్వరితగతిన భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.