
డ్రోన్లతో మలేరియా మందు పిచికారీ
రంపచోడవరం: ఏజెన్సీలో దోమల నివారణకు మలేరియా మందు స్ప్రేయింగ్‌కు డ్రోన్లతో ఉపయోగిస్తున్నట్టు స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. బుధవారం ఆయన సాయినగర్‌లో డ్రోన్‌లతో మలేరియా స్ప్రేయింగ్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టుగా రంపచోడవరం మండలంలోని రంపచోడవరం, చెరువూరు గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఒకొక్క డ్రోన్ రూ.10 లక్షలు ఉంటుందన్నారు. బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే రెండు కిలోమీటర్లు దూరం పిచికారీ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంవో జ్ఞాన,ఏడీఎంహెచ్‌వో జి.శిరీష, డీఎల్‌డీవో కోటేశ్వరరావు, సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఏఎంవో శ్రీనివాసరాజు, కార్యదర్శి రమేష్, సుధాప్రకాష్ పాల్గొన్నారు.
మోతుగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారిగా దోమల మందు పిచికారీకి డ్రోన్లు ఉపయోగిస్తున్నామని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక పీహెచ్‌సీ పరిధిలోని దబ్బగూడెంలో డ్రోన్ల ద్వారా దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఒక వినూత్న ప్రయత్నంగా డ్రోన్ల ద్వారా యాంటీ లెవెల్ ఆపరేషన్ ప్రారంభించిందన్నారు. వీటి వినియోగం వల్ల తక్కువ మందితో స్ప్రేయింగ్ పూర్తి చేయవచ్చన్నారు. లోతైన ప్రదేశాల్లో కూడా పిచికారి సాధ్యమవుతుందన్నారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్ పుల్లయ్య, డాక్టర్ ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం