
వీడియో, ఫొటోగ్రాఫర్లసంక్షేమానికి కృషి
పాడేరు: అల్లూరి జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం పాడేరులో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జి.ఈశ్వర్‌రావు(పాడేరు), ప్రధాన కార్యదర్శి కె.సాయికృష్ణ(పాడేరు), కోశాధిరిగా ఎ.ఆనంద్‌బాబు(పాడేరు), ఉపాధ్యక్షుడిగా జె.మనోహార్(పాడేరు), సహాయ కార్యదర్శులుగా కె.జాన్(జి.మాడుగుల), ఎస్.రాజీవ్(జి.మాడుగుల), శ్రీను(వంట్లమామిడి), ప్రసాద్(పాడేరు), గౌరవ అద్యక్షుడిగా డి.కోటేశ్వరరావులను ఎన్నుకున్నారు. వీరే కాకుండా అర్గనైజింగ్ కార్యదర్శులుగా ప్రతి మండలం నుంచి ఒకరు చొప్పున ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వర్‌రావు, సాయికృష్ణ మాట్లాడుతూ ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము శక్తి వంచన లేకుందా కృషి చేస్తామన్నారు.