
చెట్లు అక్రమ నరికివేతపై ఆందోళన
డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ కిల్లోగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న నీలగిరి, సిల్వర్ చెట్లు అక్రమంగా తొలగించడంపై పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య కమిటీ చైర్మన్ టి.సూర్యనారాయణ, వైస్‌చైర్మన్ కె.అప్పలనాయుడు మాట్లాడుతూ కమిటీ తీర్మాణం లేకుండా, గ్రామసభ ఏర్పాటు చేయుండా ఏకపక్షంగా చెట్లు తొలగించడం చాలా దారుణమన్నారు. తీర్మాణం లేకుండా చెట్లు తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన చెట్లకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. విద్యా కమిటీ సభ్యులు గౌరమ్మ, సుశీల, మొత్తి, ఝన్సీరాణి, పరశురాం, మోహన్‌రావు, సద్దు, బుద్దు గ్రామస్తులు పాల్గొన్నారు.

చెట్లు అక్రమ నరికివేతపై ఆందోళన