
ఆటో బోల్తా – 12 మందికి గాయాలు
డుంబ్రిగుడ: మండలంలోని కురిడి పంచాయతీ పెద్దవంతెన వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఓ ఆటో బోల్తాపడి 12 మంది గాయపడ్డారు.డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ సంతవలస గ్రామంలోని మూడు కుటుంబాలకు చెందిన విద్యార్థులు అరకులోయలో వివిధ పాఠశాలల్లో చదువుతున్నారు. వారిని పాఠశాలల్లో దిగపెట్టేందుకు విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులు ఆటోలో బయలుదేరారు. పెద్దవంతెన వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో 12 మంది గాయపడ్డారు. వారిని స్థానికుల సాయంతో ఆటోలో అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 108 వాహనం రావడం లేటు కావడంతో ఆటోలో తరలించవలసి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.