ఈదురు గాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలుల బీభత్సం

Jun 8 2025 12:52 AM | Updated on Jun 8 2025 12:52 AM

ఈదురు

ఈదురు గాలుల బీభత్సం

గూడెంకొత్తవీధి: మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్‌ తీగలపై చెట్లు పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రింతాడ పంచాయతీ అసరాడలో శనివారం మధ్యాహ్నం వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు కూలడంతో విద్యుత్‌ లైన్లు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న విద్యుత్‌ సిబ్బంది వెంటనే సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. రహదారులు జలమయం అయ్యాయి.

కొయ్యూరు: మండలంలో శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు 50 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉదయం నుంచి నెలకొన్న ఎండతీవ్రతకు జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.వర్షం కురువడంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు.

అసరాడలో విద్యుత్‌ స్తంభాలపై

కూలిన చెట్లు

సరఫరాకు అంతరాయం

ఈదురు గాలుల బీభత్సం1
1/1

ఈదురు గాలుల బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement