పోలింగ్‌ విధులపై శిక్షణ | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ విధులపై శిక్షణ

Published Fri, May 10 2024 7:05 PM

-

అడ్డతీగల/వీఆర్‌ పురం/రాజవొమ్మంగి: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ రోజున నిర్వహించాల్సిన విధి విధానాలపై పోలింగ్‌ సిబ్బందికి అడ్డతీగల, వీఆర్‌ పురం, రాజవొమ్మంగి మండలాల్లో తహసీల్దార్లు నాగమణి, మౌలానాఫిజిల్‌, సత్యనారాయణ ఆయా ప్రాంతాల్లో గురువారం అవగాహన కల్పించారు. పోలింగ్‌ రోజున ఓటు వేసే విధానంతో పాటు ఓటర్ల చేతివేలిపై సిరా చుక్కలు, పేర్లు నమోదు తదితర విధి విధానాలపై అవగాహన కల్పించారు. నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో రన్నర్స్‌గా వినియోగించాలని, రెండు గంటలకొకసారి ఓటింగ్‌ సరళిపై సెక్టార్‌ ఆఫీసర్లు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement
 
Advertisement