TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే.. | Telangana Cabinet Key Decisions On May 20th | Sakshi
Sakshi News home page

TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

May 20 2024 7:40 PM | Updated on May 20 2024 8:14 PM

Telangana Cabinet Key Decisions On May 20th

సాక్షి,హైదరాబాద్‌: ఎన్నికల కమిషన్‌(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ సమావేశం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. 

‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ ఉత్సవాలకు కాంగగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించాం. వచ్చే సీజన్‌ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్‌ నిర్ణయించింది.

అమ్మ  ఆదర్శ కమిటీద్వారా ప్రభుత్వస్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించాం. కాళేశ్వడ్యామ్‌పై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. వర్షా కాలంలో గేట్లు తెరిచే ఉంచాలి. ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉంచొద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది’ అని మంత్రి పొంగులేటి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement