
● మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా.. ● ఆత్మవిశ్వాసంతో సాగ
‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కల.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫ లమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశా. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలి తాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందానిచ్చింది.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకా లను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా. ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించారు.
– కై లాస్‌నగర్
సాక్షి: ‘గుడ్ మార్నింగ్ మేడమ్.. వెల్‌కమ్ టు ఆదిలాబాద్. ట్రెయినీ కలెక్టర్‌గా జిల్లాకు విచ్చేసిన మీకు మరోసారి ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబ నేపథ్యం వివరాలు..
ట్రెయినీ కలెక్టర్: మాది హర్యానా రాష్ట్రంలోని గురుగ్రాం. నాన్న ఇంద్రజిత్, అమ్మ సీమ. ఇద్దరూ బిజినెస్ చేస్తుంటారు. అన్న దక్ష్. గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఊరిలోనే అమ్మనాన్నలకు తోడుగా ఉంటూ వ్యాపారం చూసుకుంటారు.
సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..
ట్రెయినీ కలెక్టర్: ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వర కు గురుగ్రాంలోని బ్లూ బెల్స్‌లో చదివా. చిన్నత నం నుంచే చదువులో ముందుండేదాన్ని. స్కూ ల్‌లో నిర్వహించే డిబేట్‌లు, ఎక్స్‌ట్రా కరి క్యూలమ్‌లో పాల్గొంటూ ప్రతిభ కనబర్చుతుండేది. చదువులో ఎప్పుడూ ముందుండే నేను టెన్త్, ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అనంతరం ఢిల్లీలోని శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఎకానామిక్స్ పూర్తి చేశాను. ఆ వెంటనే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాను.
సాక్షి: యూపీఎస్సీ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు.. ఎన్నోసారి విజయం సాధించారు..
ట్రెయినీ కలెక్టర్: పదో తరగతిలోనే ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా. ఆ దిశగా అడుగులు వేశాను. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్‌లో ఏడాది పాటు శిక్షణ పొందాను. ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకున్నా. ప్రణాళి కాబద్ధంగా చదివా. 2021లో తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యా. ఇంటర్వ్యూ వరకు వెళ్లా ను. అయితే కొద్దిపాటి తేడాతో విజయం సాధించలేకపోయాను. మరో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయాను. అయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నం 2023లో జాతీయస్థాయిలో 29వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్ కావాలనే నా సంకల్పంతో పాటు నాన్న కలను నెరవేర్చాను. తెలంగాణ క్యాడర్‌కు ఎంపికై ప్రస్తుతం ట్రైనింగ్ నిమిత్తం ఆదిలాబాద్‌కు రావడం జరిగింది. ఏడాది పాటు జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. రెండు సార్లు విఫలమైన సమయంలో నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అమ్మనాన్నలు అండగా నిలి చా రు. వెన్నుతట్టారు. వారందించిన ప్రోత్సాహంతోనే విజయం సాధించాను.
సాక్షి: జిల్లాలో మీరు ఏడాది పాటు ఉండనున్నారు.. ఏయే అంశాలపై దృష్టి సారిస్తారు..
ట్రెయినీ కలెక్టర్: కలెక్టర్ సూచనలు, సలహాలు తీసుకుంటూ క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాను. శిక్షణ అనంతరం ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అట్టడుగుస్థాయికి అందించేలా నావంతు కృషి చేస్తాను.
సాక్షి: సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మీరిచ్చే సలహా..
ట్రెయినీ కలెక్టర్: సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది ఒకటి, రెండు ప్రయత్నాలకే నిరాశకు లోనవుతారు. ఇక మా వల్ల కాదంటూ వెనుకడుగు వేస్తుంటారు. అపజయాలను చూసి నిరాశ చెందొద్దు. సంకల్పం వీడకుండా ముందుడుగు వేయాలి. పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు చదవాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలి. సందేహాలుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రయత్నిస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు.

● మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా.. ● ఆత్మవిశ్వాసంతో సాగ