-
బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ చింతమన్ వనగ (67) కన్నుమూశారు. తన ఇంటివద్ద అనూహ్యంగా కుప్పకూలిన ఆయన అరగంటలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతికి కారణాలు పరిశీలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం చింతమన్ మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద అనూహ్యంగా పడిపోయారు. వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి (ఆర్ఎంఎల్)కు తరలించారు. ‘చింతమన్‌ను మంగళవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మేం ఆయనను బతికించేందుకు అరగంటపాటు శ్రమించాం. అయినప్పటికీ ఆయన శరీరం స్పందించలేదు. దీంతో 11.45గంటలకు ఆయన చనిపోయినట్లు ప్రకటించాం’ అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీకే తివారి చెప్పారు. 1950 జూన్ 1న జన్మించిన వనగా మహారాష్ట్రలోని పాల్గఢ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొలిసారి 11వ లోక్‌సభకు 1996లో ఎన్నికైన ఆయన ఆ తర్వాత 1999లో ఓసారి, తాజాగా 2014లో మరోసారి 16వ లోకసభకు ఎన్నికయ్యారు. కాగా, ఆయన మృతిపట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. -
‘నోట్ల రద్దును ప్రజలు స్వాగతిస్తున్నారు’
థానె: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తమ పార్టీపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపించదని బీజేపీ ఎంపీ చింతామన్ వాంగ్నా అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘చండీగఢ్ మున్సిపల్ ఎన్నికలు, మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ప్రజలంతా మా పార్టీవైపే ఉన్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయ’ని చింతామన్ పేర్కొన్నారు. అవినీతి, నల్లధనం నిర్మూలన కోసమే పాత పెద్ద నోట్లను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేశారని చెప్పారు. పాత పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, దేశానికి మంచి జరుగుతుందన్న నమ్మకంతో నోట్ల కష్టాలను భరిస్తున్నారని అన్నారు. ముంబై, పుణే సహా మహారాష్ట్రలోని పలు కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement