భక్తిశ్రద్ధలతో వాసవీ జయంతి | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో వాసవీ జయంతి

Published Sun, May 19 2024 2:25 AM

భక్తిశ్రద్ధలతో వాసవీ జయంతి

మాలూరు: పట్టణంలోని దొడ్డపేట మెయిన్‌ రోడ్డులో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం ఆర్యవైశ్య సముదాయ ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. వాసవి జయంతిని పురస్కరించుకుని తెల్లవారు జాము నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. దేవికి అభిషేకం, మహా మంగళ హారతి, తీర్థప్రసాద వినియోగం, సుమంగళులతో దీపోత్సవం, కన్యకా పరమేశ్వరికి పుష్ప పల్లకీ ఉత్సవం జరిగింది. పట్టణంలోని ఆర్యవైశ్య మండలి, వాసవి మండలి, వాసవి యువజన సంఘం ఆధ్వర్యంలో వాసవాంబా దేవి, నగరేశ్వరి దేవి, మహాలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణస్వామి, మహాగణపతి, ఆదిత్యాధి నవగ్రహాలకు అభిషేకం, వాసవాంబ దేవికి ప్రత్యేక పూల అలంకరణ చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఎమ్మెల్యే కేవై నంజేగౌడ, సంజీవిని ఛారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షుడు వసంతకుమార్‌, కార్యదర్శి రమేష్‌, కోశాధికారి శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement