ఏపీఎంసీ కార్యదర్శిపై వేటుకు ధర్నా | Sakshi
Sakshi News home page

ఏపీఎంసీ కార్యదర్శిపై వేటుకు ధర్నా

Published Sun, May 19 2024 2:25 AM

ఏపీఎంసీ కార్యదర్శిపై వేటుకు ధర్నా

కోలారు: నగరంలోని ఏపీఎంసీ కార్యదర్శి విజయలక్ష్మిని విధుల నుంచి సస్పెండు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండీ యజమానులు శనివారం ఏపీఎంసీ మార్కెట్‌ కార్యాలయం ముందు జీఎన్‌జీ కూరగాయల, దళారుల క్షేమాభివృద్ధి సంఘం పదాధికారులు ధర్నా చేశారు. ఆందోళన కారులు మాట్లాడుతూ ఏపీఎంసీ కార్యదర్శి విజయలక్ష్మి అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసి 50 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులు, దళారులు, ఏపీఎంసీ మార్కెట్‌ మండీ యజమానులకు ఎలాంటి పనులు జరగాల్సి ఉన్నా కార్యదర్శి విజయలక్ష్మి లంచం ఇవ్వనిదే ఏ పని చేయడం లేదన్నారు. దీనిపై దాఖలాలతో సహా ఫిర్యాదు చేసినా ఇంతవరకు కార్యదర్శిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దళారుల లైసెన్సు కోసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు డిమాండ్‌ చేస్తారన్నారు. మార్కెట్‌ యార్డులో జరుగుతున్న అక్రమాలపై తనిఖీ చేయాలన్నారు. అధికారులు వెంటనే కార్యదర్శి అక్రమాలపై తనిఖీ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్షేమాభివృద్ధి సంఘం అధ్యక్షుడు అమరేష్‌, జేడీఎస్‌ నాయకుడు సీఎంఆర్‌ శ్రీనాథ్‌, కార్యదర్శి వెంకటేగౌడ, కోశాధికారి నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement