రాష్ట్రపతి స్వర్ణ పతకం ప్రదానం | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి స్వర్ణ పతకం ప్రదానం

Published Sun, May 19 2024 2:25 AM

రాష్ట

తుమకూరు: నగరానికి సమీపంలోని నెలమంగల టి.బేగూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ వైద్య విజ్ఞాన, పరిశోధన కేంద్రంలో కీలు విభాగ సహాయక అధ్యాపకులుగా పని చేస్తున్న డాక్టర్‌ తేజస్వీకి రాష్ట్రపతి స్వర్ణ పతకం లభించింది. డిప్లోమేట్‌ఆఫ్‌ నేషనల్‌ బోర్డు పరీక్షల్లో తొలి ర్యాంకు సాధించడంతో ఈ అవార్డు వరించింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా తేజస్వీ అవార్డు అందుకున్నారు. కాగా, హాసన్‌ జిల్లా బేలూరుకు చెందిన తేజస్వీ మైసూరు మెడికల్‌ కాలేజీ నుంచి వైద్య డిగ్రీ సంపాదించారు. సిద్ధార్థ విద్యా సంస్థ అధినేత డాక్టర్‌ జి.పరమేశ్వర.. తేజీస్వీని అభినందించారు.

అలరించిన ‘నృత్యవసంతం’

బనశంకరి: నృత్యవసంతం 2024 పేరుతో శనివారం మల్లేశ్వరంలోని ఆడిటోరియంలో నిర్వహించిన నృత్యప్రదర్శన ఆహుతులను అలరించింది. కళాకారులు తమ అభినయంతో ఆకట్టుకున్నారు. నృత్యవసంతం 2024 ఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌ ఆఫ్‌ భారత కళాగ్రామ గురుకులం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నృత్యప్రదర్శనను నిర్వాహకుడు గురువసంత్‌కిరణ్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా నృత్య కళాకారులు ఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌తో సభికులను రంజింపచేశారు.

వాసవీ కన్యకా పరమేశ్వరికి పూజలు

శ్రీనివాసపురం: పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం వాసవీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఆర్యవైశ్య మండలి ఆధ్వర్యంలో విశేష పూజలను నిర్వహించారు. ప్రధాన అర్చకుడు సుబ్రమణ్యం నేతృత్వంలో పూజ జరిగాయి. వాసవీ పురాణ పారాయణం, మహిళా మండలి ఆధ్వర్యంలో భక్తిగీతాలు, భజన, సహస్రనామ కుంకుమార్చన జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి మంగళవాయిద్యాలతో పట్టణంలోని ప్రముఖ వీధుల్లో ఊరేగించారు.

రాష్ట్రపతి స్వర్ణ పతకం ప్రదానం
1/2

రాష్ట్రపతి స్వర్ణ పతకం ప్రదానం

రాష్ట్రపతి స్వర్ణ పతకం ప్రదానం
2/2

రాష్ట్రపతి స్వర్ణ పతకం ప్రదానం

Advertisement
 
Advertisement
 
Advertisement