పోలీసుశాఖ స్వతంత్రంగా పనిచేయడం లేదు | Sakshi
Sakshi News home page

పోలీసుశాఖ స్వతంత్రంగా పనిచేయడం లేదు

Published Sun, May 19 2024 2:25 AM

-

శివాజీనగర: రాష్ట్రంలో పోలీస్‌ శాఖ స్వతంత్రంగా పనిచేయడం లేదని, కేవలం సీఎం, డీసీఎం చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారనే అభిఫ్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని మాజీ సీఎం డీ.వీ.సదానందగౌడ అన్నారు. శనివారం డీజీపీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన శాంతిభద్రతలు లోపించిన విషయంపై ఫిర్యాదు చేశారు. నేరాలు అరికట్టాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం సదానందగౌడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహిళలు వాకింగ్‌ వెళ్లేందుకు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. నేరస్తులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నారన్నారు. శాంతిభద్రతలు లోపించాయన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పోలీస్‌ శాఖ అధికార పార్టీకి ఏజెంట్‌గా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిని తప్పించి స్వతంత్రంగా పని చేయాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాళవిక అవినాశ్‌, రాష్ట్ర చీఫ్‌ అధికార ప్రతినిధి అశ్వత్థనారాయణ్‌, బెంగళూరు దక్షిణ జిల్లాధ్యక్షుడు, ఎమ్మెల్యే సీ.కే.రామమూర్తి, బెంగళూరు ఉత్తర జిల్లాధ్యక్షుడు ఎస్‌.హరీశ్‌ పాల్గొన్నారు.

మాజీ సీఎం డీ.వీ.సదానందగౌడ

Advertisement
 
Advertisement
 
Advertisement