ట్రాఫిక్‌ సమస్య నివారించరూ | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ సమస్య నివారించరూ

Published Sun, May 19 2024 2:25 AM

ట్రాఫిక్‌ సమస్య నివారించరూ

శ్రీనివాసపురం : ఏపీఎంసీ మామిడి మార్కెట్‌ వద్ద తీవ్రంగా ఉన్న ట్రాఫిక్‌ సమస్యను నివారించాలని కోరుతూ కరవే సమరసేన పదాధికారులు శనివారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి వీఎన్‌ జగదీష్‌ మాట్లాడుతూ మామిడి సీజన్‌లో ఏపీఎంసీ మార్కెట్‌ యార్డుకు వస్తున్న పెద్ద సంఖ్యలో వాహనాలను చింతామణి రోడ్డు పక్కనే నిలుపుతుండడం వల్ల ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంటోందన్నారు. కోలారు జిల్లాలో ప్రత్యేకంగా శ్రీనివాసపురం తాలూకాలో 60 శాతానికి పైగా మామిడి పంట పండిస్తుండగా యేటా మే నెలలో కోత ప్రారంభమై, మండీలు కూడా ప్రారంభం అయ్యాయన్నారు. మామిడి కాయలను రవాణా చేయడానికి నిత్యం పెద్ద సంఖ్యలో పట్టణానికి వస్తున్న లారీలతో ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రం అవుతోందన్నారు. ఈ రహదారిలో ట్రాఫిక్‌ సమస్యను నివారించి ప్రమాదాలకు జరగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. స్వాభిమాని వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదిక్‌ అహ్మద్‌, వివిధ కన్నడ సంఘాల పదాధికారులు గురుమూర్తి, రాజేష్‌, ధనంజయ్‌, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement