
కింగ్ ఫిషర్ లాగే ఎగిరిపోయాడు
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా అచ్చం పక్షిలాగే ఎగిరిపోయాడని బాంబై హై కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు .
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా అచ్చం పక్షిలాగే ఎగిరిపోయాడని బాంబై హై కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు . ఆ వ్యాపారవేత్త విజయ్ మాల్యా సముచితంగా జస్టిస్ ఎస్ సి ధర్మాదికారి, బీసీ కోలాబ్వాల్ కింగ్ ఫిషర్ అధినేత మాల్యా అదే 'కింగ్ ఫిషర్' పక్షిలాగే మాయమైపోయాడని అభిప్రాయపడ్డారు.
కింగ్ ఫిఫర్ పేరుతో సంస్థను మాల్యా ఎందుకు స్థాపించాడో ఎవరికైనా తెలుసా? చరిత్రలో ఇంతకంటే సరిపోలిన పేరును ఎవరూ తన కంపెనీకి పెట్టలేరేమెనని బెంచ్ వ్యాఖ్యానించింది. ఎందుకంటే కింగ్ ఫిషర్ చాలా దూరం ఎగరగలదు..దానికి సరిహద్దులు లేవు...సరిహద్దులు లేవని తనను ఎవరూ ఆపలేరని ఆ పక్షికి తెలుసు.. అచ్చం అలాగే మాల్యాను ఎవరూ నిరోధించలేకపోయారని ధర్మాధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. 2014 లో ఋణ రికవరీ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆర్డర్ పై సర్వీస్ పన్ను శాఖ పిటీషన్, మాల్యా విమానం వేలంపై దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు, అనంతరం విచారణను సెప్టెంబర్26కి వాయిదా వేశారు.
కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం లిక్కర్ లింగ్ విజయ్ మాల్యా తీసుకున్న 950 కోట్ల అప్పులో సగం విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఉపయోగించారని ఈడీ కేసు నమోదు చేసింది. అలాగే ఏప్రిల్ 2011 మరియు సెప్టెంబర్ 2012 కాలంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రయాణీకులకు అమ్మిన టిక్కెట్లు ద్వారా మొత్తం. రూ 532 కోట్ల సర్వీస్ పన్ను రుణపడి ఉన్నాడని శాఖ వాదిస్తోంది. 17 బ్యాంకుల నుంచి రూ 9,000 కోట్లకు పైగా రుణాలను ఎగవేసిన మాల్యా విదేశాలకు పారి పోయిన సంగతి తెలిసిందే.