కనిమొళికి రాహుల్ గాంధీ ఫోన్ | Rahul rings Kanimoli, enquired about Karunanidhi health | Sakshi
Sakshi News home page

కనిమొళికి రాహుల్ గాంధీ ఫోన్

Dec 2 2016 8:14 AM | Updated on Sep 4 2017 9:44 PM

కనిమొళికి రాహుల్ గాంధీ ఫోన్

కనిమొళికి రాహుల్ గాంధీ ఫోన్

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్ధితి గురించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుసుకున్నారు.

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్ధితి గురించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. డీఎంకే నేత కనిమొళికి ఫోన్ చేసిన రాహుల్.. కరుణానిధి ఆరోగ్యంపై ఎంక్వైరీ చేశారు. కాగా, అలెర్జీ, శ్వాసకోశ సమస్యలతో గురువారం ఉదయం కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
 
కరుణానిధి అలెర్జీ సమస్యతో ఇబ్బందిపడుతున్నారని ఆయనకు కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలని పేర్కొంది. కరుణానిధి ఆసుపత్రిలో చేరడంతో డీఎంకే నేతలు ఒక్కసారిగా ఆసుపత్రికి క్యూ కట్టారు. దీనిపై స్పందించిన డీఎంకే నేత స్టాలిన్ నేతలెవరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉన్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement