
ఆలస్యం భారమే
ఏ సమయుంలో చేయూల్సిన పనిని ఆ సవుయుంలో చేసెయ్యూలి. లేకుంటే సవుస్యల్ని చేజేతులా కొనితెచ్చుకున్నట్లవుతుంది.
ఏ సమయుంలో చేయూల్సిన పనిని ఆ సవుయుంలో చేసెయ్యూలి. లేకుంటే సవుస్యల్ని చేజేతులా కొనితెచ్చుకున్నట్లవుతుంది. పొదువు విషయుంలో ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. పిల్లల చదువు కోసం, రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం పొదుపును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలి. పొదుపును వారుుదా వేస్తే ఆ మేరకు అదనపు భారం భరించాల్సి వస్తుంది.
ఇప్పుడో ఉదాహరణ చూద్దాం. ఉద్యోగం చేస్తున్న 30 ఏళ్ల యుువకుడు తన రిటైర్మెంట్ తర్వాత రూ.25 లక్షలు చేతికి రావాలని భావిస్తే ఇప్పుడైతే ఏటా రూ.24 వేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఏవో కారణాలతో ఐదేళ్లు వారుుదా వేశాడనుకుందాం. అప్పుడు ఏటా రూ.38 వేలు ఇన్వెస్ట్ చేయూల్సి వస్తుంది (పెట్టుబడులపై వార్షికాదాయుం 8% చొప్పున లెక్కించాం). పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులు మరింత ఆలస్యమైతే వ్యయం వురింత పెరుగుతుంది.
వురో ఉదాహరణ.. ఓ విద్యార్థి ఎంబీఏ పూర్తి చేయుడానికి ప్రస్తుతం సుమారు నాలుగు లక్షల రూపాయులు వ్యయువువుతుంది. అదే 15 ఏళ్ల తర్వాతైతే ఖర్చు సుమారు రూ.20 లక్షల వరకు పెరగొచ్చు. కనుక పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి పొదువు చేయుదల్చిన వారు భవిష్యత్ అవసరాలను, పరిస్థితులను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి.
అనువైన పెట్టుబడి వూర్గాలను అన్వేషించాలి. పిల్లలకు సురక్షిత భవిష్యత్తు కల్పించాలనుకునే తల్లిదండ్రులకు బ్యాంకు సేవింగ్స్ అకౌంటుతో పాటు బీమా పథకాలున్నారుు. అనుకోని పరిణామాలు సంభవించినప్పటికీ, బీమా పథకాలతో పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగుతారుు. అంతేకాదు. తల్లిదండ్రుల జీవితానికీ బీమా భరోసా చేకూరుతుంది. భవిష్యత్తుకు భద్రత చేకూరాలంటే పొదుపు, పెట్టుబడులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడమే విజయుసూత్రం.- గౌరవ్ రాజ్‌పుత్, వూర్కెటింగ్ డెరైక్టర్, అవీవా లైఫ్