గ్రామస్తులను చితకబాదిన ఎస్‌ఐ | SI thrashes villagers | Sakshi
Sakshi News home page

గ్రామస్తులను చితకబాదిన ఎస్‌ఐ

Sep 14 2015 12:15 AM | Updated on Sep 2 2018 3:42 PM

అకారణంగా తమపై లాఠీని ప్రయోగించిన ఎస్‌ఐకి ప్రజలు ఎ దురు తిరిగారు. దీంతో దిగివచ్చిన సద రు ఎస్‌ఐ ప్రజలకు

ఖిల్లాఘనపురం : అకారణంగా తమపై లాఠీని ప్రయోగించిన ఎస్‌ఐకి ప్రజలు ఎ దురు తిరిగారు. దీంతో దిగివచ్చిన సద రు ఎస్‌ఐ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇ లా ఉన్నాయి. మండల కేంద్రంలో ఆది వారం వారాంతపు సంత జరుగుతుంది. మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా, పరిసర మండలాల నుంచి కూడా ప్రజలు సంతకు వస్తుంటారు. ఈ క్రమంలో మండల పరిధిలోని ఘట్టుకాడిపల్లి గ్రామానికి చెందిన రాములు, మల్ల య్య, బాలస్వామి, కృష్ణయ్య తదితరులు బస్టాండులోని కార్ఖానా వెంకటేశ్ వెల్డింగ్ షాపు వద్ద నిల్చున్నారు.

ఇంతలో అక్కడి కి వచ్చిన ఎస్‌ఐ మశ్చేందర్‌రెడ్డి వారిని లాఠీతో చితకబాదా రు. ఎందుకు కొడుతున్నారని మొత్తుకుంటున్నా...‘‘మీలో ఒకరు బీడికాల్చారు రా’’ అంటు బాదా రు. ఇది గమనించిన సంతకు వచ్చిన వి విధ గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఎస్‌ఐకి ఎదురు తిరిగారు. బాధితులతో కలి సి నిరసన తెలిపారు. అకారణంగా బాధితులను ఎందకు కొట్టారో చెప్పాలని నిల దీశారు. ఆయన మీదకు దూసుకెళ్లా రు. వివాదం ముదురుతుండడంతో అ క్కడే ఉన్న ఎంపీపీ కృష్ణానాయక్ జోక్యం చేసుకుని ప్రజలకు సర్ది చెప్పారు. చివరకు వా రి డిమాండ్ మేరకు ఎస్‌ఐ  క్షమాపణ కో రారు. దీంతో గ్రామస్తులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement