అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి | Asaduddin Owaisi Advice to Muslims on COVID 19 Tests For Baqr Eid | Sakshi
Sakshi News home page

అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి

Jul 22 2020 6:54 AM | Updated on Jul 22 2020 6:54 AM

Asaduddin Owaisi Advice to Muslims on COVID 19 Tests For Baqr Eid - Sakshi

చార్మినార్‌: రాబోయే బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని ఖురేషి సామాజిక వర్గానికి చెందిన ముస్లిం వ్యాపారులందరూ క­రో­నా పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. కరోనా పరీక్ష­లు చేయించుకోవడం ద్వారా తమను తా­ము కాపాడుకోవడమే కాకుండా సమాజా­న్ని కాపాడినట్లు అవుతుందన్నారు. మంగళవారం యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీతో కలిసి ఆయన చార్మినార్‌ యునానీ ఆసుపత్రిలోని కరోనా పరీక్షల కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఖురేషి సామాజిక వర్గానికి జరుగుతున్న కరోనా పరీక్షలను ఆయన పరిశీలించారు. బ­క్రీద్‌ పండుగ సందర్భంగా జరిగే మాంసం విక్రయాల్లో ఖురేషి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారుల ప్రాధాన్యత ఎంతో ఉంటుందన్నారు. వీరందరూ ముందస్తుగా కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement