దూపకేడ్చి.. ఊపిరొదిలిన లేగదూడ | A sad story of Calf | Sakshi
Sakshi News home page

దూపకేడ్చి.. ఊపిరొదిలిన లేగదూడ

May 5 2016 6:26 AM | Updated on Sep 2 2018 4:16 PM

దూపకేడ్చి.. ఊపిరొదిలిన లేగదూడ - Sakshi

దూపకేడ్చి.. ఊపిరొదిలిన లేగదూడ

విపరీతమైన ఎండలు.. తాగునీటి ఎద్దడి.. అంతటా అలుముకున్న కరువుతో మనుషులే కాదు.. మూగజీవాలు తల్లడిల్లుతున్నాయనడానికి ఈ దృశ్యం సాక్ష్యం.

ఖమ్మం: విపరీతమైన ఎండలు.. తాగునీటి ఎద్దడి.. అంతటా అలుముకున్న కరువుతో మనుషులే కాదు.. మూగజీవాలు తల్లడిల్లుతున్నాయనడానికి ఈ దృశ్యం సాక్ష్యం. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ పంచాయతీ పీవీ కాలనీ రోడ్డు రైల్వేగేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ లేగదూడ ఎండతీవ్రత, దాహంతో ప్రాణాలొదిలింది. సింగరేణి బొగ్గు గనుల కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మేతకొచ్చిన దూడ దప్పికకు తాళలేక సమీపంలోని ఇళ్ల వద్దకు వెళ్లినా నీటి జాడ కనిపించలేదు.

డ్రెయినేజీలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించింది. కానీ  మురుగునీటిని మింగలేక చివరికి ఊపిరొదిలింది. కొద్దిసేపటికే అక్కడికొచ్చిన తల్లిఆవు.. దూడ శరీరాన్ని నాలుకతో నాకుతూ తలతో ఆటూఇటూ నెట్టుతూ లేపేందుకు ప్రయత్నిస్తూ ‘తల్లి’డిల్లింది. స్థానికులు గ్రహించి బకెట్‌లో నీళ్లు పెట్టగా ఆవు ఆతృతగా తాగడం, అప్పటికే దూడ ఊపిరి వదలడం స్థానికులను కలచివేసింది.          
- మణుగూరు రూరల్

Advertisement
 
Advertisement
Advertisement