హారిక గేమ్‌ ‘డ్రా’  | World womens chess championship Dronavalli is another draw | Sakshi
Sakshi News home page

హారిక గేమ్‌ ‘డ్రా’ 

Nov 10 2018 2:42 AM | Updated on Nov 10 2018 3:04 AM

World women's chess championship Dronavalli is another draw - Sakshi

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మరో ‘డ్రా’ నమోదు చేసింది. తొలి రౌండ్‌లో, రెండో రౌండ్‌లో ఆడిన రెండేసి గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ‘టైబ్రేక్‌’లో విజయాలు సాధించి ముందంజ వేసిన హారిక మూడో రౌండ్‌లోని తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. ప్రపంచ మాజీ చాంపియన్‌ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా)తో శుక్రవారం జరిగిన తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హారిక 58 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ‘డ్రా’ అయితే ఆదివారం టైబ్రేక్‌ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement