కివీస్పై ఇంగ్లండ్ ఘనవిజయం | england beats new zealand by six wickets | Sakshi
Sakshi News home page

కివీస్పై ఇంగ్లండ్ ఘనవిజయం

Mar 12 2016 6:53 PM | Updated on Sep 3 2017 7:35 PM

కివీస్పై ఇంగ్లండ్ ఘనవిజయం

కివీస్పై ఇంగ్లండ్ ఘనవిజయం

వరల్డ్ టీ 20లో భాగంగా శనివారం వాంఖేడి స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా శనివారం వాంఖేడి స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విసిరిన 170 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(55; 36 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లు), అలెక్స్(44; 36 బంతుల్లో 5 ఫోర్లు)లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. తద్వారా తొలి వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.


ఆ తరువాత జోయ్ రూట్(12) విఫలమైనా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(20) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. కాగా,  జాస్ బట్లర్(24 నాటౌట్; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్), బెన్ స్టోక్స్(8 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఇంగ్లండ్ కు విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు నమోదు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్(63) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement