ఆ ఇద్దరు ఆటగాళ్లెవరో చెప్పండి చూద్దాం.. | BCCI Shares Photo To Guess Who The Two Players Are In Twitter | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు ఆటగాళ్లెవరో చెప్పండి చూద్దాం..

Apr 9 2020 4:24 PM | Updated on Apr 9 2020 4:32 PM

BCCI Shares Photo To Guess Who The Two Players Are In Twitter - Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ గడగడలాడిస్తుండడంతో వివిధ క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వీటిలో ఐపీఎల్‌-2020, వింబుల్డన్‌, ఇతర క్రీడలు కూడా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌ జరుగుతుందో లేదో కూడా సందేహంగానే ఉంది. క్రీడలన్నీ వాయిదా పడడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆటగాళ్లు తాము ఇంటిలో చేసే ప్రతీ పనిని సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ షేర్‌ చేస్తున్నారు. కాగా భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు కూడా ట్విటర్లో తమను ఫాలో అయ్యే అభిమానుల కోసం కొన్ని ఫజిల్స్‌ను వదులుతూ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. తాజాగా బీసీసీఐ రెండు క్రికెట్‌ బాల్స్‌ పట్టుకున్న ఇద్దరు ఆటగాళ్ల చేతులను మాత్రమే చూసిస్తూ ఫోటో విడుదల చేసింది. ఫోటోలో బంతులను పట్టుకొని ఉన్న ఇద్దరు క్రికెట్లర్లు ఎవరో చెప్పాలంటూ క్రికెట్‌ ప్రేమికులకు బీసీసీఐ సవాల్‌ చేసింది. అయితే ఫోటో షేర్‌ చేసిన కాసేపటికే అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే బంతి పట్టుకున్నది ఎవరా అని మాత్రం చెప్పడం కొంచెం కష్టంగానే అనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. బీసీసీఐ మాత్రం ఆ ఆటగాళ్లు ఎవరనేది ఇంకా రివీల్‌ చేయలేదు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఒక క్రికెట్‌ అభిమాని అయితే వెంటనే బీసీసీఐకి ట్వీట్‌ చేయండి.
(కరోనా : దయనీయంగా డబ్బావాలాల పరిస్థితి)
(అక్తర్‌ వ్యాఖ్యలకు కపిల్‌ కౌంటర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement