అఫ్గానిస్తాన్‌దే విజయం

Afghanistan beats Ireland for maiden Test win  - Sakshi

డెహ్రాడూన్‌: టెస్టు హోదా లభించిన తొమ్మిది నెలలకే అఫ్గానిస్తాన్‌ జట్టు ఈ ఫార్మాట్‌లో తొలి విజయం దక్కించుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 147 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్‌ మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఆట  నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 29/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన అఫ్గానిస్తాన్‌ 47.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి విజయం సాధించింది. ఎహ్‌సానుల్లా (65 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రహ్మత్‌ షా (76; 13 ఫోర్లు) రెండో వికెట్‌కు 139 పరుగులు జోడించి అఫ్గాన్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు చేసిన రహ్మత్‌ షాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది.  

సంక్షిప్త స్కోర్లు:
ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 172, అఫ్గానిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 314, ఐర్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 288, అఫ్గానిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌: 149/3.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top