సౌతాఫ్రికా జట్ల ప్రకటన.. స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీ | South Africa Squad Announced For Afghanistan And Ireland Limited Over Series, Check Teams Names Inside | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా జట్ల ప్రకటన.. స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీ

Sep 9 2024 3:44 PM | Updated on Sep 9 2024 4:52 PM

South Africa Squad Announced For Afghanistan And Ireland Limited Over Series

సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌, ఐర్లాండ్‌లతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం​ మూడు వేర్వేరు దక్షిణాఫ్రికా జట్లను ఇవాళ (సెప్టెంబర్‌ 9) ప్రకటించారు. ‌ఈ సిరీస్‌లలో సౌతాఫ్రికా తొలుత ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు షార్జా వేదికగా జరుగనున్నాయి. ఆతర్వాత సౌతాఫ్రికా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అబుదాబీ వేదికగా జరుగనున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌, ఐర్లాండ్‌లతో జరిగే సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్‌ పేసర్‌ లుంగి ఎంగిడి ఈ సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జేసన్‌ స్మిత్‌, న్కాబా పీటర్‌, ఆండిలే సైమ్‌లేన్‌ తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ సెప్టెంబర్‌ 18, 20, 22 తేదీల్లో జరుగనుంది. ఐర్లాండ్‌తో టీ20లు సెప్టెంబర్‌ 27, 29.. వన్డేలు అక్టోబర్‌ 2, 4, 7 తేదీల్లో జరుగనున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్‌, ఆండిలే సైమ్‌లేన్‌, జేసన్‌ స్మిత్‌, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రైన్, లిజాడ్ విలియమ్స్

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నండ్రే బర్గర్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, ర్యాన్‌ రికెల్టన్, ఆండిలే సైమ్‌లేన్‌, జేసన్‌ స్మిత్‌, ట్రిస్టన్‌ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్‌వాయో, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్‌ స్టబ్స్‌, రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్, కైల్ వెర్రెయిన్, లిజాడ్ విలియమ్స్

Advertisement
 
Advertisement
Advertisement