బాబోయ్‌.. నా కూతురు ఇవన్నీ మర్చిపోతే బాగుండు!

10 Years Old girl Christmas Gifts List Goes Crazy In Social Media After Demands $4000 - Sakshi

క్రిస్మస్‌ సీజన్‌ మొదలైంది. ఈ సందర్భంగా పండగకు ఏమేం తీసుకోవాలి.. తనకు ఏమి కావాలో ఓ పదేళ్ల చిన్నారి బహుమతుల జాబితాను రాసుకుంది. క్రిస్మస్‌కు ఇవి కావాలంటూ ఆ జాబితాను తన తండ్రికి చూపించింది. అది చూసి ఆ తండ్రి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. ఈ పదేళ్ల పాప ఏం అడిగి ఉంటుందిలే ఏవో ఆడుకునే బొమ్మలు, పండగకి కొత్త బట్టలు, లేదంటే ఆడుకోవడానికి సైకిల్‌ అలాంటివేవో అడిగి ఉంటుందిలే అనుకుంటే పొరబడినట్లే. వివరాలు.. కిస్మస్‌ పండగ కోసం ఓ పదేళ్ల పాప తనకు కావాలసిన వస్తువులను ఓ కాగితంపై రాసి తన తండ్రి  జాన్సన్‌కు ఇచ్చింది. మొత్తం 26 వస్తువులు కావాలంటూ రాసిచ్చిన ఆ జాబితా చూసి జాన్సన్‌  ఆశ్చర్యానికి గురయ్యాడు. జాబితాలో పండక్కి వేసుకొవడానికి కొత్త డ్రెస్సులతో పాటు ఐఫోన్‌11, మాక్‌బుక్‌ ఎయిర్‌లతో పాటు రూ. 4వేల డాలర్లు కావాలని రాయడంతో కంగుతిన్నాడట. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో ఆ చిన్నారి బహుమతుల జాబితా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ‘నా పదేళ్ల కుతూరు ఈ క్రిస్మస్‌కు రాసుకున్న బహుమతుల జాబితా తన మెదడు పరిమితిని దాటింది’ అనే టైటిల్‌తో షేర్‌ చేసిన పోస్టుకు వేలల్లో లైకులు వచ్చి పడుతున్నాయి.

ఈ క్రమంలో ‘ఆ చిన్ని మెదడులో ఇంత పెద్ద జాబితా ఉందా!  నాకు ఆశ్చర్యంగా ఉంది.. ఇంతకి ఈ చిన్నారి అంత డబ్బుతో ఏం చేయాలనుకుంటుందో?’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top