తెలంగాణలో కాషాయ జెండా ఖాయం | BJP Win in Telangana Next Election Said Kishan Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కాషాయ జెండా ఖాయం

Aug 24 2019 10:33 AM | Updated on Aug 24 2019 10:33 AM

BJP Win in Telangana Next Election Said Kishan Reddy - Sakshi

కిషన్‌రెడ్డిని గజమాలతో సన్మానిస్తున్న బీజేపీ నాయకులు

చిలకలగూడ: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని, బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. చిలకలగూడ సాయిలత ఫంక్షన్‌హాలులో శుక్రవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు తెలంగాణవ్యాప్తంగా బీజేపీ పవనాలు బలంగా వీస్తున్నాయన్నారు.  కార్యకర్తలంతా రెట్టించిన ఉత్సాహంతో సుశిక్షుతులైన సైనికుల్లా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులంతా ఒక్కతాటిపై కృషి చేయాలన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురులేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌కు సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సంసిద్ధులుగా ఉన్నారని అన్నారు. బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండపల్లి సతీష్, రవిప్రసాద్‌గౌడ్, మేకల సారంగపాణి, కనకట్ల హరి, రాచమల్ల కృష్ణమూర్తి, ప్రభుగుప్తా, అజయ్‌నాయుడు, హర్షకిరణ్, నాగేశ్వరరెడ్డి, భాస్కర్‌ముదిరాజ్, మహేష్, శోభరాణి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement