రహమతుల్లా నుంచి ‘శశిశ్రీ’ వరకు...

రహమతుల్లా నుంచి ‘శశిశ్రీ’ వరకు...


కవి, రచయిత, వక్త, పత్రికా సంపాదకులు, ప్రసార భారతి న్యూస్ రిపోర్టర్ -ఇలా మూడున్నర దశాబ్దాలుగా తెలుగు సాహిత్యానికీ, ఇతర రంగాలకూ సేవ లందించిన ప్రజ్ఞాశాలి శశిశ్రీ (6.12.1957- 31-3- 2015). కడప జిల్లా సిద్ధవటంలో  ఎస్.బి.సలీమాబీ, ఎస్.బి.రసూల్ దంపతులకు జన్మించిన శశిశ్రీ కడప పట్టణమే కార్యక్షేత్రంగా సేవలు అందించారు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి దగ్గర ప్రాచీన సాహిత్యం, వై.సి.వి. రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి వంటి వారి దగ్గర అభ్యుదయ సాహిత్యం అధ్యయనం చేసిన విశాల దృక్పథం శశి శ్రీది. ‘మనోరంజని’ లిఖిత మాసపత్రికను, ‘సాహి త్యనేత్రం’ మాసపత్రికను స్థాపించి తనదైన ప్రతి భను చాటుకున్నారాయన.

 

 తనకు తెలుగు సాహిత్యంలో ఓనమాలు నేర్పి న తొలి గురువు పుట్టపర్తి వారేనని శశిశ్రీ  చెప్పుకునే వారు. పుట్టపర్తి ఇంటి దగ్గరే తెలుగు పంచ మహాకా వ్యాలు, సంస్కృత కావ్యం ‘భామినీ విలాసం’ చదు వుకున్నట్టు చెబుతుండేవారు. ఒకసారి పుట్టపర్తి వారి ఇంటికి  ఒక పండితుడు వచ్చినప్పుడు అక్కడే ఉన్న రహమతుల్లా (శశిశ్రీ)ను చూసి నీ పేరేమిటి? అని అడిగాడు. వెంటనే ఎస్.బి. రహమతుల్లా అని బదు లిచ్చాడు. ఆ వ్యక్తి ముఖకవళికల్లో మార్పు వచ్చింది. అంతటితో ఊరుకోక ‘‘స్వామీ! పోయి పోయి మహమ్మడ న్‌కా మీరు సాహిత్య పాఠాలు చెప్పే ది!’’ అని అనేశాడు. అది విన్న రహమ తుల్లా వెంటనే తన పుస్తకాలు చేతబట్టు కొని వెళ్లిపోతుంటే పుట్టపర్తి వారు ‘‘రేయ్! పాఠం మధ్యలో వదిలి ఎక్క డికి వెళ్తావు? కూర్చో...’’ అని వచ్చిన వ్యక్తిపై కోపా న్ని పరోక్షంగా ప్రదర్శిస్తూ మందలించారు. ఇలాంటి కొన్ని సందర్భాలు ఆయన మనసును నొప్పించాయి.

 

 ‘‘ఒరే, రహమతుల్లా! ఇప్పుడు కవిత్వమంటూ నాలుగు గీతలు గీసే నాయాళ్లంతా ఏదో ఒక కలం పేరు పెట్టుకుని చలామణి అవుతున్నారు. సరైన పద్ధ తిలో రచనలు చేస్తున్న నీవు కూడా ఒక కలం పేరు పెట్టుకుంటే పోదా!’’ అని పుట్టపర్తి రహమతుల్లాతో అన్నారు. ‘అది మీరే సూచించండి స్వామీ!’ అని కోరగా... పుట్టపర్తి ‘శశిశ్రీ’ అని పెట్టుకో, పోరా అని నవ్వుతూ చెప్పారు. ఆ విధంగా  రహ మతుల్లా ‘శశిశ్రీ’ పేరుతో సాహిత్య సేవలను అందిస్తున్నారు. ఈ పేరు  వారి పెండ్లి పత్రికల్లోనూ, దస్తా వేజు ల్లోనూ, బ్యాంకు అకౌంట్లకు కూడా చలామణి కావడం విశేషం.

 

 ‘పల్లవి’, ‘శబ్దానికి స్వాగతం’, ‘జేబులో సూర్యుడు’, ‘కాలాంతవేళ’ (వచన కావ్యాలు), ‘సీమగీతం’ (పద్య కావ్యం), ‘చూపు’ (వ్యాసాలు), ‘దహేజ్’, ‘టర్న్స్ ఆఫ్ లైఫ్’, ‘రాతిలో తేమ’ (కథా సంపుటాలు), ‘మనకు తెలి యని కడప’ (చరిత్ర), గురుదక్షిణకు చిహ్నంగా కేం ద్ర సాహిత్య అకాడమీ సహకారంతో ‘పుట్టపర్తి నారాయణాచార్య’ (విమర్శ) శశిశ్రీ రచించారు. ఆయన కథలు ఆంగ్లం, హిందీ, ఉర్దూ, కన్నడ, మల యాళ భాషలలోకి అనువాదమయ్యాయి.

 

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం-2010’, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘పట్టాభిరామిరెడ్డి లిటరరీ అవార్డు-2008’, గుంటూరు అభ్యుదయ రచయితల నుంచి ‘కొండేపూడి శ్రీనివాసరావు సాహిత్య పుర స్కారం-2008’, పత్రికా రచయితగా అందించిన సేవలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్త మ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు-2007’, ‘యునిసెఫ్ అవార్డు-2010’ వంటి ఎన్నో పురస్కా రాలు ఆయనను వరించాయి. విద్యారంగానికి అం దించిన సేవలకు గుర్తింపుగా యోగి వేమన విశ్వ విద్యాలయం పాలక మండలి సభ్యునిగా రాష్ట్ర గవ ర్నర్ చేత నియమితులయ్యారు. ఆయన ‘అభ్యుద య రచయితల సంఘం’ రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా కూడా పనిచేశారు. శశిశ్రీ మన మధ్య లేకపోయినా వారి రచనలు సాహిత్యలోకంలో విరాజిల్లుతున్నం త కాలం ఆయన కీర్తి అనే శరీరంతో జీవించివున్నట్లే.

 

 సవరణ

 ‘‘రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అనే శీర్షి కతో బుధవారం (01-04-2015) ‘సాక్షి’లో 4వ పేజీలో వెలువడిన వ్యాసంలో రచయిత్రి సామాన్య ఫోన్ నంబరు తప్పుగా అచ్చయింది. ఆ ఫోన్ నంబ ర్‌ను  80196 00900 గా చదువుకోగలరు.

 - సి.శివారెడ్డి  సి.పి. బ్రౌన్ గ్రంథాలయం, కడప

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top