సన్నీలియోన్‌ డ్యాన్స్‌ షో ప్రశాంతం | sunny leone dance show peaceful in karnataka | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్‌ డ్యాన్స్‌ షో ప్రశాంతం

Nov 4 2018 5:32 AM | Updated on Nov 4 2018 5:32 AM

sunny leone dance show peaceful in karnataka - Sakshi

సన్నీలియోన్‌

బెంగళూరు: బెంగళూరులో బాలీవుడ్‌ నటి, శృంగారతార సన్నీలియోన్‌ పాల్గొన్న ఓ డ్యాన్స్‌ కార్యక్రమం శనివారం ప్రశాంతంగా ముగిసింది. సన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కర్ణాటక రక్షణవేదికే యువసేనే(కేఆర్‌వీవైఎస్‌) హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. కన్నడ సంస్కృతిని దెబ్బతీసే ఇలాంటి కార్యక్రమాలను నిరసిస్తూ, వీరమహాదేవి సినిమాలో సన్నీ ప్రధానపాత్రలో నటించడాన్ని వ్యతిరేకిస్తూ కేఆర్‌వీవైఎస్‌ ఈ ప్రోగ్రామ్‌ను భగ్నం చేస్తామని హెచ్చరించింది. శాంతియుతంగా నిరసన తెలిపాలని అనుకున్నామనీ, కొందరు వ్యతిరేకులు హింసను రాజేసేందుకు ప్రణాళిక వేయడంతో తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని కేఆర్‌వీవైఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.హరీశ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement