ప్రియాంకను అడ్డుకున్న అధికారులు, రోడ్డుపై ధర్నా..!

Priyanka Gandhi Stopped Going To Console Adivasi Families Uttar Pradesh - Sakshi

లక్నో : సోన్‌భద్ర జిల్లాలో భూవివాదంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుంటుంబాల్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీని అధికారులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్తల కారణంగా ఆమె పర్యటన సాధ్యం కాదని అన్నారు. నారాయణ్‌పూర్‌  సమీపంలో కాన్వాయ్‌ అడ్డుకోవడంతో ప్రియాంక రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రత ఏర్పాటు చేశారు.

తనను అడ్డగించడంపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు నివాసముంటున్న ఉబ్బా గ్రామానికి నలుగురం మాత్రమే వెళ్లొస్తామని చెప్పినా అధికారులు అనుమతించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రియాంక, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చునార్‌ అతిథి గృహానికి తరలించారు. కాగా, శాంతి భద్రతలకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రియాంక, మరికొంతమందిని అడ్డుకుని అతిథి గృహానికి తరలించామని యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ చెప్పారు. ప్రియాంకను అక్రమంగా అరెస్టు చేశారని ట్విటర్‌ వేదికగా రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. భూవివాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆదివాసీ కుటుంబాల్ని ఓదార్చాలనుకోవడం నేరమా అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో వెల్లడవుతోందన్నారు. 
(చదవండి : రెండు వర్గాల మధ్య ఘర్షణ: 9 మంది మృతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top