మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత | Madhya Pradesh Former CM Babulal Gaur Dies At 89 | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత

Aug 21 2019 10:04 AM | Updated on Aug 23 2019 2:29 PM

Madhya Pradesh Former CM Babulal Gaur Dies At 89 - Sakshi

అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌ (89) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 2004 నుంచి 2005 వరకు బాబులాల్‌ మధ్యప్రదేశ్‌ సీఎంగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్‌లో 1930, జూన్‌ 2న ఆయన జన్మించారు. 

కార్మిక సంఘాల నేతగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జనతా పార్టీ సహకారంతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొం‍దారు. అనంతరం బీజేపీలో చేరి మధ్యప్రదేశ్‌లో బీజేపీ విస్తరించడానికి కృషి చేశారు. గోవింద్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి బాబులాల్‌ 10 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వయసు పైబడటంతో 2018 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018లో ఆయన కోడలు కృష్ణాగౌర్‌ గోవింద్‌పురా నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement