బిట్‌కాయిన్లకో ఏటీఎం

India gets its first cryptocurrency ATM - Sakshi

బనశంకరి (బెంగళూరు): బెంగళూరులో దేశంలోనే తొలి క్రిప్టో కరెన్సీ ఏటీఎం కియోస్క్‌ ఏర్పాటైంది. రాజాజీ నగర్‌లోని యునోకాయిన్‌ టెక్నాలజీస్‌ సంస్థ కెంప్‌ఫోర్ట్‌ మాల్‌లో దీన్ని ఏర్పాటుచేసింది. ఈ ఏటీఎం ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా బిట్‌కాయిన్లను భారతీయ కరెన్సీగా మార్చుకోవచ్చు. బిట్‌కాయిన్లపై భారత్‌లో నిషేధం ఉంది. బిట్‌కాయిన్లతో వస్తువులను కొనాలంటే సమస్యలు వస్తుండటంతో పరిష్కారంగా క్రిప్టోకరెన్సీ ఏటీఎంను అందుబాటులోకి తెచ్చినట్లు యునోకాయిన్‌ టెక్నాలజీస్‌ అధికారులు చెప్పారు. నగదు డిపాజిట్, విత్‌డ్రాకు సంబంధించి దేశంలో అమల్లో ఉన్న నిబంధనలకు లోబడే ఈ ఏటీఎం పనిచేస్తుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top