ఎన్‌కౌంటర్ హత్యలు వ్యవస్థకు మచ్చ: కాంగ్రెస్‌ ఎంపీ

Congress MP Karti Chidambaram Responds Encounter Killing Of Disha Accused - Sakshi

సత్వర న్యాయం కోసం.. ఎన్‌కౌంటర్‌ సరైన మార్గం కాదు

ఎన్‌కౌంటర్‌ను తప్పుపట్టిన కాంగ్రెస్‌ ఎంపీ

చెన్నై:  షాద్‌నగర్‌ కేసులోని నిందితులను శుక్రవారం తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ పి చిదంబరం ట్విటర్‌లో స్పందించారు. 'అత్యాచారమనేది ఒక క్రూరమైన నేరం. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అత్యాచారానికి పాల్పడిన నిందితులను నేను సమర్థించకున్నా.. ఎన్‌కౌంటర్ హత్యలు మన వ్యవస్థకు మచ్చ అని విమర్శించారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు, తమిళనాడు శివగంగ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీ చిదంబరం.. ఎన్‌కౌంటర్‌ హత్యలు మన వ్యవస్థకు మచ్చ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. సత్వర న్యాయం కోసం.. ఎన్‌కౌంటర్‌ సరైన మార్గం కాదని అభిప్రాయపడ్డారు. 

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసులో సీన్‌ రీకన్‌స్ట్రక‌్షన్‌ కోసం నిందితులను శుక్రవారం తెల్లవారుజామున షాద్‌నగర్ చటాన్‌పల్లి శివారుకు తీసుకురాగా.. వారు పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు ఆత్మరక్షణలో  భాగంగా నలుగురు నిందితులను  కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top