వైరల్‌ వీడియో: గున్న ఏనుగు వాకింగ్‌!

Baby Elephant Vedavathi Runs Behind Her Keeper Somu In Mysore Zoo - Sakshi

సాక్షి, బెంగుళూరు: సాధారణంగా పెంపుడు జంతువులు తమతో పాటు వాకింగ్‌ చేస్తే యజమానులు చాలా సంతోష పడతారు. అవి తమతో పాటు నడవటం, పరుగెత్తటం చూసి మురిసిపోతారు. తాజాగా మైసూర్‌లోని‌ జూ సంరక్షణలో ఉన్న ఓ గున్న ఏనుగు తన కేర్‌ టేకర్‌ వెంట నడుస్తూ, పరుగెత్తే వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కర్ణాటక జూ తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. ‘మైసూర్‌ జంతు ప్రదర్శనశాలలో వేదవతి అనే చిన్నఏనుగు సోము సంరక్షణలో పెరుగుతోంది. వేదవతి కాకుండా మరో ఐదు గున్న ఏనుగులు అతని సంరక్షణలో ఉన్నాయి’ అని ‌ పేర్కొంది.

మరో వీడియోను పోస్ట్‌ చేసి.. ‘వేదవతి ఎలా పరుగెత్తుతుందో చూడండి. ఈ చిన్న ఏనుగు రోజూ నడవటానికి ఇష్టపడుతుంది. మైసూర్‌ జంతు ప్రదర్శనశాలలో వేదవతి చేరినప్పుడు కేవలం 89 కిలోల బరువు మాత్రమే ఉండేది. రెండు నెలల వ్యవధిలో సోము సంరక్షణలో సుమారు 20 కేజీల బరువు పెరిగింది. కేర్‌ టేకర్‌ సోము ప్రతి రోజు వేదవతిని జూ చూట్టు వాకింగ్‌కి తీసుకెళ్తాడు. ఈ గున్న ఏనుగు రోజుకు మూడు సార్లు జూ చుట్టు పరుగులు తీస్తూ వ్యాయామం పూర్తి చేసుకుంటుంది’ అని కామెంట్‌ కర్ణాటక జూ తెలిపింది. ‘కరోనా కాలంలో మేము బంధీలమయ్యాంది. గున్న ఏనుగుకు ఎప్పుడూ స్వేచ్ఛే’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top