'మాల్యాకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్' | A Special PMLA court issued non-bailable warrant against Vijay Mallya | Sakshi
Sakshi News home page

'మాల్యాకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్'

Apr 18 2016 5:12 PM | Updated on Sep 27 2018 5:03 PM

'మాల్యాకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్' - Sakshi

'మాల్యాకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్'

భారీ మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేతకు పాల్పడిన మనీ లాండరింగ్ కేసులో విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా ముంబయి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.

ముంబయి: భారీ మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేతకు పాల్పడిన మనీ లాండరింగ్ కేసులో విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా ముంబయి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.

ఈడీ మాల్యాకు దాఖలు చేసిన నోటీసులు సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టు(పీఎంఎల్ఏ) తోసిపుచ్చింది. ఈడీ చేసిన ఆరోపణలు సమర్థిస్తూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మాల్యాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం విజయ్ మాల్యా లండన్లో ఉన్నారు. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ కూడా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement