నిర్మాతగా మారుతున్న సీనియర్ హీరోయిన్ | yesteryear heroine meena wants to become producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారుతున్న సీనియర్ హీరోయిన్

May 20 2016 1:58 PM | Updated on Sep 4 2017 12:32 AM

నిర్మాతగా మారుతున్న సీనియర్ హీరోయిన్

నిర్మాతగా మారుతున్న సీనియర్ హీరోయిన్

తొంబైలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్ మీనా, త్వరలో మరో పాత్రకు రెడీ అవుతోంది. ఇటీవల దృశ్యం సినిమాతో మరోసారి నటిగా ప్రూవ్ చేసుకున్న మీనా, నిర్మాతగా...

తొంబైలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్ మీనా, త్వరలో మరో పాత్రకు రెడీ అవుతోంది. ఇటీవల దృశ్యం సినిమాతో మరోసారి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న మీనా, ఇపుడు నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే తన ప్రొడక్షన్ హౌస్కు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టిన ఈ భామ టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ స్టార్లతో సినిమాలు నిర్మించాలని భావిస్తోంది. తన నిర్మాణసంస్థలో మహేష్ బాబు, కమల్ హాసన్ లాంటి హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది.

అయితే ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. బ్రహ్మోత్సవం రిలీజ్ తరువాత మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ సినిమాకు రెడీ అవుతున్నాడు మహేష్. ఆ తరువాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్ల కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలు లైన్లో ఉన్నాయి. కమల్ కూడా శభాష్ నాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత కూడా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. మరి మీనా ఈ ప్రాజెక్ట్లు పూర్తయ్యేవరకు మీనా వెయిట్ చేస్తుందో లేక వేరే హీరోలతో నిర్మాణం మొదలెడుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement