ప్రజల కోసం చేసిన పాట ఇది

Special Corona Song By Music Director Koti - Sakshi

‘‘కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ప్రజల్ని చైతన్యపరిచేలా ఓ పాట చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. గిటార్‌ వాయిస్తూ ట్యూన్‌ చేయడం మొదలుపెట్టాను. ఆ ట్యూన్‌ని ఫోన్‌లో రికార్డు చేసి రచయిత శ్రీనివాస్‌ మౌళికి పంపించాను. మేమిద్దరం కలిసి ఓ సినిమాకి పనిచేశాం. కానీ, ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఆ చిత్రంలోని పాటలన్నీ తనే రాశాడు. ఆ లిరిక్స్, అందులోని పదాలు నాకు బాగా నచ్చాయి. అందుకే నా ట్యూన్‌ని ఆయనకి పంపించి, కరోనా నేపథ్యంలో ప్రజల్ని బాగా చైతన్యపరిచేలా మంచి లిరిక్స్‌ రాయాలని చెప్పా.. అలా ‘లైటజ్‌ ఫైట్‌ కరోనా’ పాట చేశాం’’ అని చెప్పారు సంగీతదర్శకుడు కోటి. ఇంకా ఈ పాట గురించి ఆయన మరిన్ని విశేషాలు చెప్పారు.
► నా ట్యూన్‌ విని శ్రీనివాస్‌ చరణం రాసి పంపించాడు. అప్పటికి ఇంగ్లిష్‌ పదాల్లేవు. ఈ పాట గురించి చర్చిద్దామని ఇంటికి రమ్మన్నాను. అప్పుడు ఇంగ్లిష్‌ పదాలు వచ్చాయి. ట్యూన్‌ కూడా చక్కగా కుదిరింది. నేను, మా అబ్బాయి రోషన్‌ కలిసి రికార్డ్‌ చేశాం. సమర్థ్‌ అనే కీ బోర్డ్‌ ప్లేయర్‌ కూడా నాకు రికార్డింగ్‌లో సహాయం చేశాడు.
► గిటార్‌తోనే ఈ పాటని కంపోజ్‌ చేశాను. చాలా బాగా వచ్చింది. కానీ, కొంచెం పెద్దగా ఉండటంతో నేను, రోషన్‌ కూర్చుని షార్ట్‌ చేశాం. గిటార్, వయొలిన్‌.. ఇలాంటి వాటితో మిక్స్‌ చేసి ఫైనల్‌ రికార్డింగ్‌ కోసం కృష్ణానగర్‌లోని ఓ రికార్డింగ్‌ స్టూడియోకి మెయిల్‌లో పంపించాను. అతను మొత్తం రికార్డింగ్‌ చేసి, క్లీన్‌గా అన్ని లెవల్స్‌ చూసుకుని తర్వాత నాకు పంపించాడు. 
► ఈ పాటని ముందు నా స్నేహితులకు పంపించాను.. అందరూ చాలా బాగుందని అభినందించారు. అదే రోజు రాత్రి చిరంజీవిగారికి కూడా పంపించాను. ఉదయాన్నే ఆయన ఫోన్‌ చేసి, ‘పాట చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ పాటకి వీడియో చేద్దాం’ అన్నారు. ‘మీరు మెగాస్టార్‌.. మీరు వీడియో చేస్తే ఇంకేం కావాలి.. అందరికీ బాగా చేరువవుతుంది’ అన్నాను.
► చిరంజీవిగారే నాగార్జునగారికి ఫోన్‌ చేశారు. అలాగే ఆయనే వరుణ్‌ తేజ్, సాయిధరమ్‌తో పాడమని చెప్పారు. నిజానికి వెంకటేశ్‌గారు, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌.. ఇలా చాలామంది చేయాల్సింది. కానీ కుదరలేదు. అందుకే చిరంజీవిగారు, నాగార్జునగారు, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌లతో రికార్డ్‌ చేశాం. చిరంజీవిగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ పాట ఇంత పాపులర్‌ అయింది. 
► ఈ వెర్షన్‌ రిలీజ్‌ చేయకముందే నేను గిటారుతో చేసిన పాటను రిలీజ్‌ చేశాను. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగువారందరూ  అభినందించారు. ఆ తర్వాత ఈ నలుగురితో  చేసిన వీడియో యూట్యూబ్, వాట్సాప్‌ ఇలా.. సోషల్‌ మీడియాలోనూ బాగా వైరల్‌ అయింది. 
► కమర్షియల్‌ సాంగ్స్‌ ఎన్నో చేశాను. కానీ మానవాళికి నా వంతు ప్రయత్నంగా ఈ పాట చేశాను. అందుకే చిరంజీవిగారు ‘మా వంతు సాయం చేయాలి కదా’ అన్నారు. ఆయన నాకు ఓ బ్రదర్‌లాగా అన్నమాట. మేము కలసి ఎన్నో సినిమాలు చేశాం.. అయితే అవి కమర్షియల్‌. కానీ, ఈ పాట ప్రజల కోసం. అందరి కోసం చేసిన ఈ పాటకి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది.
► మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు, కేసీఆర్‌గారు ప్రజల క్షేమం కోసం ఈ ‘లాక్‌డౌన్‌ని’ పక్కాగా అమలు చేస్తున్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-05-2020
May 30, 2020, 03:49 IST
న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2019 ఏప్రిల్‌ –2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో...
30-05-2020
May 30, 2020, 02:00 IST
సోషల్‌ మీడియాలో శుక్రవారం సందడి చేశారు సమంత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో సమంత...
29-05-2020
May 29, 2020, 22:33 IST
మరో ఐదుగురు వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ...
29-05-2020
May 29, 2020, 21:24 IST
మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు (80) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.
29-05-2020
May 29, 2020, 21:00 IST
ఆటోలు 1+2, కార్లు 1+3, మినీ వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతి ఇస్తున్నాం. 
29-05-2020
May 29, 2020, 20:50 IST
సాక్షి, ప్రకాశం: అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ‘టామాటో ఛాలేంజ్’‌ పేరుతో జిల్లాలోని రైతులకు భరోసానిస్తున్నారు. అంతేగాక లాక్‌డౌన్‌లో తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్న‌ పేదవారికి...
29-05-2020
May 29, 2020, 20:00 IST
ముంబై వలస వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో..
29-05-2020
May 29, 2020, 18:56 IST
వెల్లింగ్ట‌న్‌‌: అనుకోకుండా ముంచుకొచ్చిన‌‌ క‌రోనా విప‌త్తు వ‌ల్ల ఇప్ప‌టికీ ఎన్నో దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూ డేంజ‌ర్...
29-05-2020
May 29, 2020, 17:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశాన్ని కరోనా వైరస్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో వైరస్‌ల బారిన పడకుండా రక్షించుకునేందుకు వైద్య సిబ్బంది...
29-05-2020
May 29, 2020, 17:00 IST
పట్నా : రెండు రోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై తల్లి మృతదేహాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించిన ఒక...
29-05-2020
May 29, 2020, 16:24 IST
సాక్షి, అమరావతి : దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌...
29-05-2020
May 29, 2020, 16:24 IST
కాలిఫోర్నియా: 'చికిత్స క‌న్నా నివార‌ణ మేలు' అనే మాట‌ క‌రోనాకు స‌రిగ్గా స‌రిపోతుంది. మందు లేని ఈ మాయ‌దారి రోగానికి మ‌నం...
29-05-2020
May 29, 2020, 15:50 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 11638...
29-05-2020
May 29, 2020, 15:40 IST
ఛండీగ‌ర్ : దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక క‌రోనా కేసులు పెరుగుతున్న రాష్ర్టాల్లో ఢిల్లీ ఒక‌టి. అంతేకాకుండా డిల్లీ స‌రిహ‌ద్దుల‌కు ఆనుకొని ఉన్న...
29-05-2020
May 29, 2020, 15:39 IST
లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి  కరోనా  పై నిరంతరం...
29-05-2020
May 29, 2020, 15:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న క్రమంలో అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ కీలక అంశాన్ని ప్రకటించింది. 2020 అక్టోబర్ చివరి నాటికి...
29-05-2020
May 29, 2020, 15:09 IST
ల‌క్నో‌: మీర‌ట్ వాసులు కోవిడ్ భ‌యంతో వ‌ణికిపోతున్నారు. దీనికి కార‌ణం అక్క‌డి కోతుల గుంపు చేసిన తుంట‌రి ప‌నే. ఆట బొమ్మ...
29-05-2020
May 29, 2020, 14:25 IST
న్యూఢిల్లీ: 2018 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియా కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో...
29-05-2020
May 29, 2020, 14:09 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ మే 31 (ఆదివారం)తో...
29-05-2020
May 29, 2020, 13:27 IST
న్యూఢిల్లీ : రోజురోజుకీ కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. కనీస కనికరం లేకుండా ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. భారత్‌లో శుక్రవారం నాటికి కరోనా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top