హంపీలో చిక్కుకున్న నటి | Senior Actress Jayanthi Lockdown in Hampi Karnataka | Sakshi
Sakshi News home page

హంపీలో చిక్కుకున్న నటి జయంతి

Apr 16 2020 7:41 AM | Updated on Apr 16 2020 7:41 AM

Senior Actress Jayanthi Lockdown in Hampi Karnataka - Sakshi

కర్ణాటక ,హొసపేటె:  కన్నడ సీనియర్‌ సినీ నటి జయంతి హంపీలో చిక్కుకుపోయారు. హంపీలో ఉంటున్న  తన కుమారుడు కృష్ణకుమార్‌ను చూసేందుకు గత నెల 22న లాక్‌డౌన్‌ ప్రకటించడానికి రెండు రోజుల ముందు నటి జయంతి బెంగళూరునుంచి  ఇక్కడకు విచ్చేశారు. ఉన్న ఫళంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో  బెంగళూరుకు వెళ్లలేకపోయారు. జయంతి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఈ నెల 14న పూర్తి అవుతుందని భావించామన్నారు. తిరిగి లాక్‌డౌన్‌ వచ్చే నెల 3 వరకు పొడిగించడంతో  హంపీ సమీపంలోని ఓ హోటల్లోనే ఉండి పోవాల్సి వచ్చిందన్నారు.   హోటల్‌లో తమకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement