హిందీలో కత్తి పట్టేదెవరు? | Sanjay Leela Bhansali has acquired the Hindi remake rights of Kaththi | Sakshi
Sakshi News home page

హిందీలో కత్తి పట్టేదెవరు?

Aug 20 2018 1:29 AM | Updated on Apr 3 2019 6:34 PM

Sanjay Leela Bhansali has acquired the Hindi remake rights of Kaththi - Sakshi

సంజయ్‌లీలా భన్సాలీ

బాలీవుడ్‌లో సౌత్‌ సినిమాల రీమేక్‌ గాలి బాగా వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సౌత్‌ నుంచి ‘టెంపర్, ప్రస్థానం, అర్జున్‌ రెడ్డి, విక్రమ్‌ వేదా’ సినిమాలు రీమేక్‌ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో తమిళం చిత్రం ‘కత్తి’ కూడా చేరిందని బాలీవుడ్‌ టాక్‌. విజయ్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ సాధించింది. ఇప్పుడీ చిత్రం హిందీ రీమేక్‌ రైట్స్‌ను బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దక్కించుకున్నారట.

గతంలో సౌత్‌ నుంచి ‘విక్రమార్కుడు’ సినిమాను ‘రౌడీ రాథోడ్‌’గా,  తమిళ మూవీ ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్‌’గా రీమేక్‌ అయ్యింది) సినిమాను ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ పేరుతో హిందీలో నిర్మించి హిట్‌ సాధించారు భన్సాలీ. ఈ రెండు సినిమాల్లో అక్షయ్‌ కుమార్‌నే హీరో కావడం విశేషం. మరి.. ‘కత్తి’ రీమేక్‌లో కూడా అక్షయ్‌నే హీరోగా నటిస్తారా? లేక ఇంకో హీరో చేస్తారా?  తెలియడానికి కాస్త టైమ్‌ ఉంది. తమిళ ‘కత్తి’ సినిమా తెలుగులో చిరంజీవి హీరోగా ‘ఖైదీ నంబర్‌ 150’ పేరుతో రీమేక్‌ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement