వెబ్‌ సిరీస్‌లో సామ్‌.. చైతూ వెయిటింగ్‌ | Samantha Akkineni Digital Debut With The Family Man 2 | Sakshi
Sakshi News home page

వెబ్‌ సిరీస్‌లో సామ్‌.. చైతూ వెయిటింగ్‌

Nov 28 2019 3:46 PM | Updated on Nov 28 2019 5:04 PM

Samantha Akkineni Digital Debut With The Family Man 2 - Sakshi

వరుస హిట్లతో, వైవిధ్యభరితమైన పాత్రలతో సమంతా అక్కినేని తన అభిమానులను పెంచుకుంటూ పోతోంది. అయితే కమర్షియల్‌ పాత్రల్లోనే కాకుండా తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలనుకున్నట్లు సామ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’ హిందీ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. మొదటిసారిగా వెబ్‌ సిరీస్‌లో నటించడమే కాక తొలిసారిగా నెగెటివ్‌ రోల్‌ చేస్తోంది. సెప్టెంబర్‌లో విడుదలైన ద ఫ్యామిలీ మెన్‌కు సీక్వెల్‌గా ఫ్యామిలీ మెన్‌ 2 వస్తోంది. ఈ సందర్భంగా సామ్‌ ‘ద ఫ్యామిలీ మెన్‌ 2’కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో కీలక పాత్రలో నటించే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేకు సామ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని చైతూ కామెంట్‌ చేశారు. కాగా అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమైన ద ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌కు విశేషాదరణ దక్కింది. మనోజ్‌ బాజ్‌పేయీ, ప్రియమణి, సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ థ్రిల్లర్‌ 10 ఎపిసోడ్‌లతో విజయవంతంగా కొనసాగింది. తాజాగా దీని సీక్వెల్‌లో సామ్‌ నటిస్తుండటంతో ఇది మొదటి సిరీస్‌ను మించిపోతుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement