‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’ | Pakistani Actress Mehwish Hayat Slams Bollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌, బాలీవుడ్‌పై పాక్‌ నటి ఫైర్‌

Aug 16 2019 2:08 PM | Updated on Aug 16 2019 2:14 PM

Pakistani Actress Mehwish Hayat Slams Bollywood - Sakshi

హాలీవుడ్‌, బాలీవుడ్‌పై పాక్‌ నటి ఫైర్‌

న్యూఢిల్లీ : సినిమాల్లో తమ దేశాన్ని ప్రతికూలంగా చూపుతున్నారని ప్రముఖ పాకిస్తాన్‌ నటి మెవిష్‌ హయత్‌ బాలీవుడ్‌, హాలీవుడ్‌లపై విరుచుకుపడ్డారు. ఓస్లోలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హయత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హాలీవుడ్‌లో ముస్లింల గురించి తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు.  అయితే తాను ఎందుకు అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందో హయత్‌  గల్ఫ్‌న్యూస్‌కు వివరించారు. 

దుబాయ్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ ఈవెంట్‌లో బాలీవుడ్‌ గురించీ మాట్లాడానని ఆమె చెప్పుకొచ్చారు. ఐరాస వేదికగానూ తాను హాలీవుడ్‌లో ముస్లింలను చెడుగా చూపుతున్న తీరు ఇస్లాంఫోబియాకు దారితీస్తున్న వైనాన్ని ఎండగట్టానని చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ వేదికపై పాక్‌ నటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనదేనా అనే చర్చ జరుగుతోంది. భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌ నటి వ్యాఖ్యలపై హాట్‌ డిబేట్‌ సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement