ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.? | Jr NTR's Heroine Confirmed for RRR | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

Aug 21 2019 12:58 PM | Updated on Aug 21 2019 3:21 PM

Jr NTR's Heroine Confirmed for RRR - Sakshi

బాహుబలి తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్‌ వండర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న  ఈ మల్టీస్టారర్‌ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ నటిస్తున్నారు.

ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తుందని ప్రకటించినా వ్యక్తిగత కారణాలతో ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా విదేశీ భామ కోసం వేట సాగిస్తున్నారు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. తాజాగా ఎన్టీఆర్‌ సరసన నటించబోయే హీరోయిన్‌ ఫైనల్‌ అయినట్టుగా తెలుస్తోంది.

చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించకపోయినా హాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ బ్రిటీష్ భామ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఆ భామ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో కూడా జాయిన్‌ అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఆ భామ ఎవరు..? అన్న విషయం తెలియాలంటే మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుంచి అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement