నందును ఇంట్లోకి రానివ్వని గీతామాధురి | geetha madhuri do not allow nandu to maternal home | Sakshi
Sakshi News home page

నందును ఇంట్లోకి రానివ్వని గీతామాధురి

Jul 3 2014 3:15 PM | Updated on Aug 20 2018 5:39 PM

నందును ఇంట్లోకి రానివ్వని గీతామాధురి - Sakshi

నందును ఇంట్లోకి రానివ్వని గీతామాధురి

ప్రేమపక్షులు నందు.. గీతామాధురి ఇప్పుడు కలిసి ఉండట్లేదా? తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నందును ఇప్పుడు గాయని గీతామాధురి అసలు ఇంట్లోకి రానివ్వడం లేదా?

ప్రేమపక్షులు నందు.. గీతామాధురి ఇప్పుడు కలిసి ఉండట్లేదా? తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నందును ఇప్పుడు గాయని గీతామాధురి అసలు ఇంట్లోకి రానివ్వడం లేదా? అవునట. ఈ విషయాన్ని స్వయంగా గీతామాధురే తన ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిపింది. 'ఇంట్లోకి నాట్ ఎలోవ్డ్' అంటూ తన స్టేటస్ అప్డేట్ చేసింది. ఖంగారు పడకండి.. వాళ్లిద్దరు ఏమీ విడిపోలేదు, ఇద్దరి మధ్య ఎలాంటి జగడాలు కూడా జరగలేదు. (చదవండి: నందుతో గీతామాధురి నిశ్చితార్థం)

అయితే.. ఇప్పుడు ఉన్నది ఆషాఢ మాసం కాబట్టి, ఆ వంక పెట్టి పుట్టింటికి వెళ్లిన గీతా మాధురి.. ఎటూ ఆషాఢ మాసంలో అల్లుడు అత్తగారిని చూడకూడదు, ఆ ఇంటి గడప తొక్కకూడదు కాబట్టి ఆషాఢం అల్లుడిని ఇంట్లోకి రానిచ్చేది లేదని ఆట పట్టిస్తోంది. అందుకే గీతామాధురి పుట్టింట్లోకి నందు వెళ్లలేకపోతున్నాడు. దాదాపు మూడున్నరేళ్ల పాటు ప్రేమించుకున్న నందు, గీతామాధురి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఆటోనగర్ సూర్య సినిమాలో అతడి నటనను సమంత కూడా ట్విట్టర్ వేదికగా చాలా మెచ్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement