breaking news
lovebirds
-
విశేషాలకు కొదవ లేని కొడవ కళ్యాణం
అక్కడ పురోహితులు ఉండరు... వేద మంత్రోచ్చారణలు వినిపించవు... వధూవరులు ఏడడుగులు వేయరు... ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడక ఇలానే ఉంటుంది. అంతేనా? ఇంకా చాలా విశేషాలుంటాయి. తెలుగు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఈ వేడుక ఉంటుంది. టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఈ రెండు పద్ధతుల్లోనూ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి జరిగింది. దీంతో కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగి ఉంటుందా?! అనే చర్చలు మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...విజయ్ దేవరకొండది తెలంగాణలోని నాగర్‌కర్నూలు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, సంప్రదాయాలు మిగతా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వారి పూర్వీకులను గౌరవిస్తూ వివాహ వేడుకలను జరుపుతారు. మామూలుగా జరిగే తెలుగు వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. అరిటాకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ వివాహ వేడుకను వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుంది. వేదికను అరిటాకులతో పచ్చదనానికి ప్రతీకగా అలంకరిస్తారు.భిన్నమైన కట్టుకొడవ పెళ్లిలో వధూవరులిద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు ‘కుష్య’ అనే నల్లని కోటు, ‘చేలే’ అని పిలిచే నడుముకు కట్టే పట్టీ, ‘పీచే కత్తి’ (చిన్న కత్తి) ధరిస్తాడు. ఇక వధువు చీరకట్టు సంప్రదాయం మిగతా చీరకట్టులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా భారతీయ వస్త్రధారణలో చీర పల్లూను ముందు నుంచి వెనక వైపుకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీర కొంగును వెనక నుంచి ముందుకు తీసి, వేస్తారు. అలాగే, వెనక వైపు కుచ్చిళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కట్టు ఈ కమ్యూనిటీలో కనిపిస్తుంది. ఇక వేడుక అంతా డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలు చేస్తారు. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. ఈ పద్ధతిని అనుసరిస్తూ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా కూడా ఈ నృత్యాలు చేశారు.కొడవలు ఎవరు కొడవలను ‘కూర్గులు’ అని కూడా అంటారు. వీరిది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు (కూర్గ్) ప్రాంతం. వీరు సుమారు 1.6 లక్షల దాకా ఉన్నారని అంచనా. గతంలో వీరు వ్యవసాయం, ఇతర పనుల మీద ఆధారపడి జీవించేవారు. 19వ శతాబ్దంలో కాఫీ సాగు ద్వారా వీరి పనికి ప్రాధాన్యం లభించింది. మొదట వ్యవసాయ ఆధారిత పండుగలు జరుపుకునే వీరు అనంతరం ఇతర పండుగలూ జరుపుకోవడం మొదలుపెట్టారు. కావేరి నది వీరికి ప్రాధాన్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో వీరు ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. వీరి నైపుణ్యాలను గమనించి బ్రిటిష్ అధికారులు వీరిని మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వినియోగించారు. కొడవల్లో అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు.బంగారు నాణేల మూటపెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అరటి చెట్టు నాటుతారు. వరుడు దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు కాండాన్ని నరకడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత వరుడు పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఆ సమయంలో ముందుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు వరుడిని ఆశీర్వదిస్తారు. తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణేలను అందిస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.12 గులకరాళ్లతో వధువుపై సర్వహక్కులువధూవరులిద్ద్దరూ మల్లెపూల దండలు మార్చుకుంటారు. పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు. దీంతో పాటు వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి, వధువుపై సర్వహక్కులు ఇస్తున్నామని చెబుతారు. అయితే వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకొని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికీ హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు. పుట్టింటివారికి కూతురి పట్ల కొంత బాధ్యత ఉంటందని సూచించడానికే ఇలా చేస్తారని చెప్పవచ్చు.నీళ్ల బిందె తలపై పెట్టుకొని..పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికే ఈ ఘట్టం. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ పెళ్లిళ్లలో మాంసాహారాన్ని వడ్డిస్తారు. అందులో ప్రధానంగా పంది మాంసం, మద్యం తప్పనిసరిగా ఉంటాయట. దీంతో విజయ్–రష్మిక పెళ్లి వేడుకలో ఈ వంటకాన్ని కూడా వడ్డించారు. ఇలా ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరిగిన విజయ్–రష్మికల వివాహ వేడుకలు ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అయ్యాయి. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.విరోష్ సెలబ్రేషన్స్‘‘దేశంలోని ప్రజలందరూ ఎప్పుడూ మా ప్రయాణం, ప్రేమలో భాగమయ్యే ఉన్నారు. అందుకే మీ అందరితో మా వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ప్రతి వేడుకను ఇండియా ఎలా అయితే ఫుడ్ అండ్ మిఠాయిలతో సెలబ్రేట్ చేసుకుంటుందో అలా మా జీవితంలోని ఈ బిగ్ మూమెంట్‌ను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మార్చి 1న దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ స్వీట్ ట్రక్స్‌ను పంపిస్తున్నాం (కొన్ని నగరాల్లో మాత్రమే). అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో విజయ్ అండ్ రష్మిక’’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక ‘ఎక్స్’ లో శనివారం రాత్రి ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ‘విరోష్ సెలబ్రేషన్స్’ అంటూ, ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు, ఏయే దేవాలయాల్లో అన్నదానం నిర్వహించనున్నారన్న జాబితాను కూడా ఈ ఇద్దరూ షేర్ చేశారు.స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్... ∙తెలంగాణ – హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ∙ఢిల్లీ (ఎన్సీటీ) – ఢిల్లీ ∙చండీఘర్ (యూటీ)– చండీఘర్ ∙ఉత్తరప్రదేశ్ – నోయిడా, గజియాబాద్ ∙గుజరాత్ – అహ్మదాబాద్ ∙మధ్యప్రదేశ్ – భోపాల్ ∙మహారాష్ట్ర – ముంబై ∙రాజస్థాన్ – జైపూర్ ∙ఆంధ్రప్రదేశ్ – వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి ∙కేరళ – కొచ్చి ∙కర్ణాటక – మైసూర్, కూర్గ్, బెంగళూరు ∙తమిళనాడు – కోయంబత్తూర్, చెన్నై ∙పాండిచ్చేరి (యూటీ) – పాండిచ్చేరి ∙బిహార్– (ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా సోమవారానికి వాయిదా). -
Valentine's Day : ప్రెటీ లుక్స్.. ఇవిగో టిప్స్!
అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందులోనూ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రేమికుల రోజు మరికొన్ని గంటల దూరంలో ఉంది. తన పార్ట్నర్తో రొమాంటిక్‌గా గడిపే క్షణాల్లో అందంగా మెరిసి పోవాలని అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిలైతే ముందు నుంచే అలర్ట్‌గా ఉంటారు. కానీ అబ్బాయిలు మాత్రం జిడ్డు ముఖంతో ఎలా రా బాబూ అని తెగ హైరానా పడిపోతుంటారు. అవునా..? అందుకే ఇంటి చిట్కాలతో ఇన్స్టంట్ గ్లో వచ్చేలా చేసుకోవచ్చు. లవ్బర్డ్స్కోసం ఉపయోగపడే అలాంటి బ్యూటీ టిప్స్ ఒకసారి చెక్ చేద్దాం.అందం అనే దానికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఇష్టపడే వ్యక్తికి ఆకర్షణీయంగా కనిపించాలి. అలా ఉండాలంటే, మానిసిక ఆరోగ్యంతోపాటు, శారీరంగా కూడా కావాలి. అలా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నపుడు వచ్చే ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం వేరే లెవల్లో ఉంటుంది. దీనికి ప్రేయసి లేదా, ప్రియుడి చేయూత ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించే ధైర్యాన్నిస్తుంది. కొండంత బలాన్నిస్తుంది. దీనికి మించిన అందం ఏముంటుంది?అందకోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనీలేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. మనం రోజూ ఉపయోగించే వాటితోనే అందాన్ని మెరుగు పరచుకోవచ్చు.ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్శనగ పిండిలో కాస్తంత పెరుగు, కొద్దిగా నిమ్మకాల కలిపి మంచి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి పట్టించి, బాగా ఆరిన తరువాత మృదువుగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి.నిమ్మరసం, తేనెతో కూడా ముఖంపై ఉండే మురికిని వదిలించుకోవచ్చు. ఫేస్ వాష్, సబ్బులకు బదులు నిమ్మరసం, తేనె కలిపి ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల మృత కణాలు తొలిగిపోతాయి. ముఖం మెరిసిపోతుంది.బాదం, గంధం పొడి, వేపాకుల పేస్టు కలిపి రాస్తే.. ముఖంపై ఉండే మురికి పోయి స్కిన్ గ్లోయింగ్‌గా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలుకు ఇది ఉపయోగపడుతుంది.ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా ఆర్గానిక్ పసుపు కలిపి ముఖానికి మెడకు,మోచేతులకు చక్కగా అప్లయ్ చేసి ఆరిన తరువాత కడిగేసుకుంటే మంచి గ్లో వస్తుంది.చర్మానికి బొప్పాయి పండు చాలా చక్కగా పని చేస్తుంది. బొప్పాయి పండు పేస్ట్ రాస్తే చర్మం.. ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మృదువుగా మారి మంచి గ్లో వస్తుంది. అలాగే నచ్చినట్టుగా మీసాలు, గడ్డాన్ని చక్కగా నీట్‌గా కట్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్‌ను మెయింటైన్ చేయాలి. దీంతోపాటు చక్కటి పెర్ఫ్యూమ్ వాడితే మరీ మంచిది. ఇక అమ్మాయిలైతే ఆలు గడ్డ రసంలో రెండు చుక్కల ఆల్మండ్ ఆయిల్, శనగపిండి కలిపి మాస్క్‌లాగా వేసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే కాఫీ ఫౌడర్‌లో కాస్తం టొమాటో రసం వేసి, ముఖానికి, మెడకు,మోచేతుల దాకా అప్లయ్ చేసి కాసేపు మసాజ్ చేసి శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. టమాటా రసం, ఓట్స్ పొడి పాలు. ఈ స్క్రబ్‌లు ఉపయోగించినా చర్మం తాజాగా మెరుస్తుంది. ఇలా ప్యాక్ వేసుకున్నాక చేసిన రెండు ఐస్‌ముక్కలతో ముఖంపై మృదువగా మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకుని రసాయను లేని మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరిన్ని టిప్స్చర్మం ఆరోగ్యంగా . యవ్వనంగా కనిపించాలనుకుంటే ప్రతి రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి.తగినన్ని నీళ్లు తాగాలి. చర్మానికి విటమిన్లు, ఖనిజాలు ఎంత అవసరమో, నీళ్లు కూడా అంతే అవసరం. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం నుండి అదనపు మలినాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది. తాజాపండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ, క్రమంతప్పకుండా రోజుకు కనీసంఅరగంటసేపు ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇద్దరికీ వర్తిస్తాయి. వీటన్నింటి కంటే ముందు మీ మనసులోని ఆనందం, మీ శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్లే మీ ముఖానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. కనుక అందం గురించి పట్టించుకోకుండా, ఆనందంగా గడపండి. మీ బంధాన్ని దృఢం చేసుకోండి. మర్చిపోలేని జ్ఞాపకాలను పోగు చేసుకోండి. హ్యాపీ వాలైంటైన్స్ డే! -
Wedding Outfits: లవ్‌బర్డ్స్ కోసం డ్రీమీ ఔట్ ఫిట్స్ (ఫోటోలు)
-
రాజ కుమారుడిలా రాహుల్.. అందంగా అతియా (ఫోటోలు)
-
Valentines day: లవ్‌బర్డ్స్ ప్రత్యేకతలు ఇవీ!
ప్రేమికుల దినోత్సవం.. ఏదో పులకింతకు గురి చేసే పదం. పెళ్లయి ఏళ్లు గడిచినా, ఇప్పుడే డేటింగ్ ప్రారంభించినా, సిచ్యుయేషనల్ రిలేషన్షిప్లో ఉన్న లవ్‌బర్డ్స్ జీవితాల్లో ఈ రోజుకున్న ప్రత్యేకతే వేరు. అన్నట్టు ప్రేమికులను అందంగా వర్ణించాలంటే లవ్‌బర్డ్స్ అని ఎందుకు అంటాం. అసలు ఈ పోలిక ఎలా వచ్చింది? లవ్‌బర్డ్స్ గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఇపుడు తెలుసుకుందాం. అత్యంత ప్రాచుర్యం పొందిన అందమైన, తెలివైనచిలుక జాతికి చెందిన పక్షులే ఈ లవ్‌బర్డ్స్. ఈ చిన్న పక్షులు 100 సంవత్సరాలకు పైగా ఆఫ్రికన్ చిలుకలలో అత్యంత ప్రియమైన రకాల్లో ఒకటి. కొన్ని చిలుకలు మనుషులను అనుకరిస్తూ, మాట్లాడగలవు కానీ. లవ్‌బర్డ్స్ సాధారణంగా మాట్లాడవు. ఈలలు లేదా డోర్‌బెల్స్ అనుకరిస్తాయి. కానీ చాలా చిన్నప్పటినుంచీ నేర్పితే మాట్లాడుతాయిట. లవ్బర్డ్స్లో రకాలు లవ్బర్డ్స్లో తొమ్మిది వేర్వేరు ఉప-జాతులు ఉన్నాయి. వీటిలో దేనికవే వాటి ప్రత్యేక లక్షణాలతో ఉంటాయి. మాస్క్డ్ లవ్‌బర్డ్, బ్లాక్-చెంపల లవ్‌బర్డ్, ఫిషర్స్ లవ్‌బర్డ్, న్యాసా లవ్‌బర్డ్, స్విండర్న్ లవ్‌బర్డ్, రెడ్-ఫేస్డ్ లవ్‌బర్డ్, అబిస్సినియన్ లవ్‌బర్డ్, మడగాస్కర్ లవ్‌బర్డ్ , లవ్లీ పీచ్-ఫేస్డ్ లవ్‌బర్డ్ ఉన్నాయి. అయితే పసుపు, గ్రీన్, బ్లూ కలర్లో ఉండే లవ్‌బర్డ్స్ బాగా పాపులర్. ప్రేమికులతో లవ్‌బర్డ్స్ అని పోలిక ఎందుకంటే లవ్‌బర్డ్స్ చాలా చురుకైన పక్షులు. ప్రేమ పక్షులు సాధారణంగా 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. జీవితాంతం ప్రేమలోనే మునిగి తేలతాయి. ఏకభాగస్వామితో మాత్రమే బలమైన ప్రేమబంధాన్ని కొనసాగిస్తాయి. ఒకదానికొకటి కొసరి..కొసరి తినిపించుకుంటూ,ఎపుడూ అచ్చిక బుచ్చిక లాడు కుంటూ నిజమైన ప్రేమకు నిదర్శనంగా ఉంటాయి. ఒకవేళ జంట వీడితే డిప్రెషన్‌కు కూడా లోనవుతాయట. జంట వీడితే తట్టుకోలేవు! మనుషుల మాదిరిగానే, ప్రేమపక్షులు కూడా తమ భాగస్వామి లేదా జట్టు నుండి విడిపోయినప్పుడు నిరాశకు గురవుతాయి. ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు. దీంతో దిగులుతో ఆహారం మానేసి చివరికి చనిపోవచ్చు కూడా. లవ్బర్డ్స్లో ఆడ, మగ తేడాను సులభంగా గుర్తించవచ్చు. సాధారణంగా మగవి ఆడవాటి కంటే పెద్దగా ఉంటాయి. సాధారణంగా నల్లటి రెక్కలున్న మగ ప్రేమపక్షికి ఎర్రటి ఈకల కిరీటం ఉంటుంది. అంతేకాదు మేటింగ్ సమయంలో లవ్ బర్డ్స్ హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. దీంతోవాటిల్లో జెలసీ, దూకుడు తత్వంబాగా పెరుగుతుందిట. ఫలితంగా కొన్ని సందర్భాల్లో తగాదాలు, ఒక్కోసారి ఒకదాన్ని మరొకటి చంపుకునే దాకా పోతాయిట. ప్రేమ పక్షులు ఏమి తింటాయి? లవ్‌బర్డ్స్ చిన్ని చిన్ని గింజలు, విత్తనాలు, గడ్డి, పండ్లు , కొన్ని రకాల కూరగాయలను తింటాయి. చాలా ఇళ్లలో రంధ్రాలు ఉన్న మట్టి కుండల్లోనే లవ్‌బర్డ్స్ ని ఎందుకు పెంచుతారో ఎపుడైనా ఆలోచించారా? ప్రేమ పక్షులు.. అడవిలో చెట్లు, రాళ్ళు, పొదల్లోని రంధ్రాలలో నివసించడం వీటికి అలవాటు. అడవులు తగ్గిపోవడంతో భవనాల్లోని రంధ్రాల్లోగూడు కట్టుకుంటాయి. అందుకే ఇళ్లలో కూడా సహజంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఆ ఏర్పాటు అన్నమాట. -
లవ్‌బర్డ్.. ఇలా చేయడం ఎప్పుడూ చూసి ఉండరు!
హోం.. స్వీట్ హోం.. ఎవరికైనా ఇళ్లంటే ఇష్టమే. పందిరి ఇంటి నుంచి పదంస్తుల మేడ వరకు ఏదైనా సరే ఒక ఇళ్లు కలిగి ఉండాలని అంతా కోరకుంటాం. పక్షులు కూడా అంతే గుడ్లు పెట్టే సమయంలో కచ్చితంగా గూడు కట్టుకుంటాయి. అందుకోసం ఎంతగానో శ్రమిస్తాయి. చెట్లు, మొక్కల నుంచి రకరకాల పదార్థాలు సేకరించి... వాటిని అల్లి చిత్రవిచ్రితంగా గూళ్లు కడుతుంటాయి. అయితే ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద ట్విట్టర్లో షేర్ చేసిన పోస్టులో ఉన్న లవ్‌బర్డ్ చాలా స్మార్ట్. ఎంతో నేర్పుగా ఆకులోని మధ్య ఈనెను తొలచి వేస్తుంది. అలా తొగించిన వాటిని ఈకల్లో దాచిపెట్టుకుంటోంది. మాములుగా అయితే నోటితో పట్టుకుని.. గూడు నిర్మించే చోటుకి వాటిని తరలించాలి. ఒక్కోసారి ఒక్కోటి పట్టుకుని వెళితే సమయం, శ్రమ ఎక్కువ అవుతుందని ఆలోచించిన లవ్‌బర్డ్ ఈనెలను ఈకల్లో దాచుకోవడమే ఇక్క ‘స్మార్ట్’. ఇక లవ్‌బర్డ్ తెలివైన పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద దానిని షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారు పక్షి తెలివి తేటలకి తెగ ముచ్చటపడుతున్నారు. Just amazing... Love bird rips the mid vein of leaves, tucks it in the feather & flies to build its nest when it has enough. Not flying each time. Efficiency👌 From Channa Prakash pic.twitter.com/ddJaEuFJ39 — Susanta Nanda IFS (@susantananda3) June 22, 2021 చదవండి : కార్బెట్ రిజర్వ్‌లో తెల్ల నెమలి.. 85 ఏళ్లలో ఇదే తొలిసారి -
నాలుగు వేడుకల పెళ్లి
బాలీవుడ్లో వన్నాఫ్ ఆఫ్ ది క్రేజీ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్ – ఆలియా భట్ వివాహం గురించిన వార్తలు తరచూ తెరపైకి వస్తూనే ఉంటాయి. తాజాగా వీరి వివాహం గురించిన ఓ కొత్త వార్త బాలీవుడ్ టౌన్లో వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో రణ్‌బీర్ – ఆలియా ప్రేమికుల నుంచి భార్యాభర్తలు అవుతారని టాక్. వీరి పెళ్లిని డిసెంబరు 7న లేదా 21న జరిపేలా రెండు కుటుంబాల సభ్యులు ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. పెళ్లి వేడుకలను నాలుగు రోజులు జరపాలనుకుంటున్నారని టాక్. -
నందును ఇంట్లోకి రానివ్వని గీతామాధురి
ప్రేమపక్షులు నందు.. గీతామాధురి ఇప్పుడు కలిసి ఉండట్లేదా? తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నందును ఇప్పుడు గాయని గీతామాధురి అసలు ఇంట్లోకి రానివ్వడం లేదా? అవునట. ఈ విషయాన్ని స్వయంగా గీతామాధురే తన ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిపింది. 'ఇంట్లోకి నాట్ ఎలోవ్డ్' అంటూ తన స్టేటస్ అప్డేట్ చేసింది. ఖంగారు పడకండి.. వాళ్లిద్దరు ఏమీ విడిపోలేదు, ఇద్దరి మధ్య ఎలాంటి జగడాలు కూడా జరగలేదు. (చదవండి: నందుతో గీతామాధురి నిశ్చితార్థం) అయితే.. ఇప్పుడు ఉన్నది ఆషాఢ మాసం కాబట్టి, ఆ వంక పెట్టి పుట్టింటికి వెళ్లిన గీతా మాధురి.. ఎటూ ఆషాఢ మాసంలో అల్లుడు అత్తగారిని చూడకూడదు, ఆ ఇంటి గడప తొక్కకూడదు కాబట్టి ఆషాఢం అల్లుడిని ఇంట్లోకి రానిచ్చేది లేదని ఆట పట్టిస్తోంది. అందుకే గీతామాధురి పుట్టింట్లోకి నందు వెళ్లలేకపోతున్నాడు. దాదాపు మూడున్నరేళ్ల పాటు ప్రేమించుకున్న నందు, గీతామాధురి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఆటోనగర్ సూర్య సినిమాలో అతడి నటనను సమంత కూడా ట్విట్టర్ వేదికగా చాలా మెచ్చుకుంది.


