
చిరు బర్త్ డే పార్టీకి అమితాబ్, ఆమిర్
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలకు బాలీవుడ్ అగ్రనటులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ హాజరుకానున్నారు.
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలకు బాలీవుడ్ అగ్రనటులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ హాజరుకానున్నారు. చిరంజీవి 60 జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన తనయుడు హీరో రామ్ చరణ్ ఈనెల 22న స్టార్ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు. దీనికి అమితాబ్, ఆమిర్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు.
అమితాబ్, ఆమిర్ లను ఇప్పటికే ఆహ్వానించారని... వారిద్దరూ రావడం ఖాయమని రామ్ చరణ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అమితాబ్ ను రామ్ చరణ్ వ్యక్తిగతంగా ఆహ్వానించారని తెలిపాయి. శనివారం సాయంత్రం జరగనున్న చిరంజీవి జన్మదిన వేడుకల కోసం ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వెంకటేష్, నాగార్జున, జగపతిబాబుతో సహా తెలుగు సినిమా ప్రముఖులు బర్త్ డే పార్టీకి రానున్నారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య పుట్టినరోజు వేడుకలకు హాజరవుతారని సమాచారం.