ప్రభాస్‌ మూవీలో వివాదాల నటి | Arshi Khan Confirmed movie with Prabhas | Sakshi
Sakshi News home page

Jan 21 2018 9:59 AM | Updated on Apr 3 2019 6:34 PM

Arshi Khan Confirmed movie with Prabhas - Sakshi

సాక్షి, సినిమా : యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం సాహో మూవీ షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఇదయ్యాక బాలీవుడ్‌ సినిమా ఉంటుందని స్వయంగా ప్రభాసే ప్రకటించటం తెలిసిందే. అయితే ఈ రెండింటిలో ఏ ప్రాజెక్టో తెలీదుగానీ మోడల్‌, నటి అర్షి ఖాన్‌.. తాను ప్రభాస్‌ చిత్రంలో నటించబోతున్నానంటూ ప్రకటించేసింది. 

‘‘ప్రభాస్‌తో ఓ భారీ చిత్రంలో నటించబోతున్నా.. ఇంతకు మించి వివరాలు ఇప్పుడే చెప్పలేను’’ అంటూ ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, భోపాల్‌కు చెందిన మోడల్‌ అర్షి.. పాక్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీతో ప్రేమాయణం అంటూ వార్తల్లో నిలిచారు. ఆపై బిగ్‌ బాస్‌ షో 11వ సీజన్‌లో పాల్గొన్న ఆమె మరిన్ని వివాదాలను మూటగట్టుకున్నారు. 

ప్రస్తుతం అర్షి ఓ హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తుండగా.. ఇంతలో ఏకంగా ప్రభాస్‌ చిత్రంలో కూడా యాక్ట్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement