నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

Arrest Warrant to Actor Vishal in Tamil Nadu - Sakshi

చెన్నై ,పెరంబూరు: నటుడు విశాల్‌కు చెన్నై, ఎగ్మూర్‌ కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. నటుడు, నిర్మాత విశాల్‌ తన కార్యనిర్వాహక వర్గం వేతనాలకు సంబంధించిన టీడీఎస్‌ను ఆదాయపన్నుశాఖకు సరిగ్గా చెల్లించలేదనే ఆరోపణలనను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ అదికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇలా పలుమార్లు నోటీసులు జారీ చేసినా విశాల్‌ హాజరుకాకపోవడంతో ఐటీ అధికారులు చెన్నై ఎగ్మూర్‌ కోర్టులో విశాల్‌పై పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణకు రాగా విశాల్‌ ఐటీ కార్యాలయానికి హాజరు కాని ఎడల నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసి అరెస్ట్‌ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top