‘ఆ జంట’ వీడియో డిలీట్‌ చేసిన టిక్‌టాక్‌ | TikTok Pulling Down Video Of Indo Pak Same Gender Couple | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌: ఇద్దరమ్మాయిల వీడియో డిలీట్‌

Dec 8 2019 10:48 AM | Updated on Dec 8 2019 11:43 AM

TikTok Pulling Down Video Of Indo Pak Same Gender Couple - Sakshi

ఇ‍ద్దరు యువతులు కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోను టిక్‌టాక్‌లో షేర్‌ చేయగా.. అద్భుతంగా వచ్చిందని ప్రశంసలు అందుకుంటున్న సమయంలో టిక్‌టాక్‌ దాన్ని తొలగించింది. దీంతో సదరు యువతులు టిక్‌టాక్‌ తీరును తప్పుపడుతున్నారు. వీడియోను తొలగించేంత తప్పు ఏం చేశామని టిక్‌టాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే టిక్‌టాక్‌ వీరి వీడియో తొలగించడానికి ప్రధాన కారణం వీరు లెస్బియన్స్‌ కావటమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇండో పాక్‌కు చెందిన యువతులు అంజలి చక్రా, సుందాస్‌ మాలిక్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి వర్షంలో పారదర్శక గొడుగు కింద నిలబడి నవ్వుతూ, ముద్దులు పెట్టుకుంటూ దిగిన ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తాజాగా వీళ్లిద్దరూ మరోసారి టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారారు. అంజలి, సుందాస్‌ కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను టిక్‌టాక్‌లో షేర్‌ చేశారు. ఇందులో ఈ జంట సాధారణ దుస్తుల్లో డ్యాన్స్‌ చేస్తూ.. ఒక్కసారిగా సాంప్రదాయ దుస్తుల్లోకి మారిపోతారు. అయితే ఆ వీడియోను టిక్‌టాక్‌ తొలగించింది. దీంతో ఆగ్రహానికి లోనైన అంజలి అదే వీడియోను తిరిగి ట్విటర్‌లో షేర్‌ చేసింది. నిబంధనలను ఉల్లంఘించామంటూ టిక్‌టాక్‌ ఈ వీడియోను తొలగించిందని ఆవేదనను వ్యక్తం చేసింది. వేలమంది వీక్షించిన ఈ వీడియోను తొలగించిన టిక్‌టాక్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అయినా మీ ప్రేమను ఇలాంటి యాప్స్‌ ఆపలేవని ఓ నెటిజన్‌ వారికి మద్దతు తెలిపాడు. (చదవండి:ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement