చైనాలో 'పీకే' రికార్డు | PK earns record USD 13.5 million in China | Sakshi
Sakshi News home page

చైనాలో 'పీకే' రికార్డు

Jun 2 2015 7:04 PM | Updated on Sep 3 2017 3:07 AM

చైనాలో 'పీకే' రికార్డు

చైనాలో 'పీకే' రికార్డు

ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'పీకే' చైనాలోనూ కనక వర్షం కురిపిస్తోంది.

బీజింగ్: ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'పీకే' చైనాలోనూ కనక వర్షం కురిపిస్తోంది. మే 22న ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేశారు. పీకే చిత్రం రెండు వారాల్లో 86 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

చైనాలో సినిమా విశ్లేషకుల నుంచి పీకేకు ప్రశంసలు వస్తున్నాయి. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారత్లో రికార్డు వసూళ్ల సాధించిన సంగతి తెలిసిందే.  చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా 'పీకే'గా నిలిచింది. అమెరికా-కెనడాలో ఈ చిత్రం సాధించిన వసూళ్లను చైనాలో అధిగమించడం మరో విశేషం.  చైనాలో పీకే చిత్రం 5000 స్క్రీన్లపై ప్రదర్శితమవుతోంది. 2009లో బాలీవుడ్ చిత్రం త్రి ఇడియట్స్ చిత్రం కూడా చైనాలో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు పీకే అంతకుమించిన విజయం సాధించింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement